నేటి నుంచి ప్రజావేదిక..ఏ రోజు ఎవరంటే?

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ నెల 16 నుంచి 28 వరకు ప్రజావేదికను నిర్వహించనున్నారు.

By :  Admin
Update: 2024-12-16 05:35 GMT

ప్రజావేదికను నిర్వహించాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావేదిక ద్వారా పార్టీ కార్యకర్తల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆ మేరకు నేటి నుంచి మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 16 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. 16న మాజీ మంత్రులు కేఎస్‌ జవహర్, దేవినేని ఉమా, ఏపీ లిడ్‌ క్యాప్‌ చైర్మన్‌ పిల్లి మాణిక్యరావు, 17న ప్రభుత్వ సలహదారు ఎంపీ షరీఫ్, వర్ల రామయ్య, దీపక్‌రెడ్డి, 18న రవాణాశాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మల్ల సురేంద్ర, 19న మండలి విప్‌ పంచుమర్తి అనురాధ, గండి బాబ్జి, 20న మంత్రి సవిత, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, గొట్టిముక్కల రఘురామరాజు, 21న గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, పల్లా శ్రీనివాసరావు, ఆనం వెంకటరమణారెడ్డి, 23న ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, శాప్‌ చైర్మన్‌ రవినాయుడు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, 24న మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మంతెన రామరాజు, దేవదత్, 26న మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం పీలా గోవింద సత్యనారాయణ, 27న పురపాలక శాఖ మంత్రి నారాయణ, పల్లా శ్రీనివాసరావు, బొడ్డు వెంకటరమణ చౌదరి, 28న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పల్లా శ్రీనివాసరావు, బి శ్రీనివాసులు పాల్గొననున్నారు.

Tags:    

Similar News