న్యూడ్ కాల్స్ అసలు ట్విస్టు ఏమిటో తెలుసా ?

అవతలి నుండి ఒక అమ్మాయి బట్టలు లేకుండా న్యూడ్ గానో లేకపోతే సెమీ న్యూడ్ గానో కనబడుతుంది.

Update: 2024-10-20 10:29 GMT

ఈమధ్య సైబర్ మోసాలు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అపరిచితుల నుండి వచ్చే ఫోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎంతగా చెబుతున్నా చాలామంది అమాయకంగా మోసపోతున్నారు. సైబర్ మోసగాళ్ళ సమస్యే ఎక్కువగా ఉందంటే కొంతకాలంగా న్యూడ్ కాల్స్ బెడద కూడా బాగా ఎక్కువైపోతోంది. విషయం ఏమిటంటే మనకు తెలీని వాళ్ళదగ్గర నుండి మనకు వీడియో కాల్ వస్తుంది. వీడియో కాల్ రాగానే చాలామంది తమ మొబైల్ లోని వీడియో కాల్ ఆప్షన్ ఆన్ చేస్తారు. దాంతో అవతలి నుండి ఒక అమ్మాయి బట్టలు లేకుండా న్యూడ్ గానో లేకపోతే సెమీ న్యూడ్ గానో కనబడుతుంది.

వీడియో కాల్లో అమ్మాయి న్యూడ్ గా కనబడగానే ముందు ఇవతల వాళ్ళ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇదే సమయంలో అవతలి అమ్మాయి హొయలు పోతు ఏవేవో అడుగుతుంటే వాటన్నింటికీ ఇవతల వాళ్ళు అమాయకంగా సమాధానాలు ఇస్తుంటారు. కొద్దిసేపటికి కాల్ కట్ అయిపోతుంది. వెంటనే మరో వీడియో కాల్ వస్తుంది. ఆ వీడియో కాల్లో ఇతవల వ్యక్తే బట్టలు లేకుండా కనబడతాడు. దాంతో ముందు షాక్ కు గురైన సదరు వ్యక్తికి కొద్దిసేపటికి తేరుకోగానే చెమటలు పట్టడం మొదలవుతుంది. దాంతో అవతలి వాళ్ళు బ్లాక్ మెయిల్ మొదలుపెట్టి డబ్బులు గుంజుకోవటం మామూలైపోతుంది. ఇలాంటి న్యూడ్ వీడియో కాల్స్ ఎక్కవైపోతున్నాయి.

ఈమధ్యనే జగిత్యాల జిల్లాలో ఒక ఎంఎల్ఏకి ఒక మహిళ నుండి న్యూడ్ కాల్ రావటం, వెంటనే ఎంఎల్ఏ కాల్ కట్ చేసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయటం సంచలనంగా మారింది. ఇపుడా కేసును పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. ఎంఎల్ఏకి వచ్చిన న్యూడ్ కాల్ నెంబర్ ఉత్తరప్రదేశ్ దిగా పోలీసులు గుర్తించారు. ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే పోలీసులు జనాలకు ఒక అప్పీల్ చేశారు. అదేమిటంటే అపరిచుతుల నుండి వచ్చే వీడియో కాల్స్ ను ఎట్టిపరిస్ధితుల్లోను అటెండ్ కావద్దని. ఒకవేళ రిపీటెడ్ గా వీడియో కాల్స్ వస్తుంటే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వీడియో కాల్స్ లో అసలు ట్విస్టు ఏమిటంటే అవతలి నుండి న్యూడ్ గా ఫోన్ చేసే మహిళ అసలు మహిళే కాదు. అంటే వీడియో కాల్ లో కనబడే మహిళ మాయలేడీ అన్నమాట. మాయలేడీ అంటే ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో తయారైన భ్రమాత్మక మహిళ అన్నమాట. ఎవరిదో మహిళ మొహాన్ని సదరు ఏఐ పరిజ్ఞానంతో డీప్ ఫేక్ ద్వారా అమ్మాయిగా తయారుచేసి నిజమైన అమ్మాయిగా జనాలను భ్రమల్లో ముంచెత్తుతారు. అవతల మాట్లాడుతున్నది మహిళ అనే భ్రమల్లోనే ఇవతలి వాళ్ళుంటారు. కొద్దిసేపు న్యూడ్ వీడియో కాల్ లో మాట్లాడినా చాలు మన వ్యవహారం అంతా అవతలి వాళ్ళ గుప్పిట్లోకి వెళ్ళిపోతుంది.

ఎలాగంటే అవతలి వాళ్ళు న్యూడ్ వీడియో కాల్ చేయగానే ఇవతలి వాళ్ళు ఏమరుపాటుగా కొద్దిసేపు మాట్లాడినా సరే మన ఫొటోను అవతల సైబర్ మోసగాళ్ళు మొత్తం రికార్డు చేసేస్తారు. డీప్ ఫేక్ పరిజ్ఞానం సాయంతో మొహం ఆధారంగా మొత్తం శరీరాన్ని తయారుచేస్తారు. ప్రత్యేకమైన అల్గారిథం ద్వారా అచ్చం ఇవతల వాళ్ళలాగే తయారుచేస్తారు. ఆ శరీరానికి బట్టులు లేకుండా అంటే న్యూడ్ గా రెడీచేసి ఆ న్యూడ్ వీడియోను మళ్ళీ ఇవతలి వాళ్ళకే పంపుతారు. ఇకేముంది అక్కడినుండి బ్లాక్ మెయిల్ చేస్తు డబ్బులు గుంజుతునే ఉంటారు. అవతలి అమ్మాయికి కూడా ప్రత్యేకమైన అల్గారిధం సాయంతో మాట్లాడుతున్నట్లే భ్రమల్లో ముంచేస్తారు. ఈ విషయాలన్నింటినీ పోలీసులు పదేపదే చెబుతు జనాలను అప్రమత్తం చేస్తున్నారు.

అపరిచితుల నుండి వీడియో కాల్ రాగానే ఆన్సర్ చేయద్దంటున్నారు. ఒకవేళ ఆన్సర్ చేయాల్సొస్తే ముందుగా మొబైల్లో ఉండే ఫ్రంట్ కెమెరాను వేలితో మూసేయాలని పోలీసులు చెబుతున్నారు. దాని వల్ల అవతలి వాళ్ళు వీడియోకాల్ లో కనబడతారే కాని ఇవతల వాళ్ళు కెమెరాను క్లోజ్ చేశారు కాబట్టి ఇవతల వాళ్ళ మొహం అవతలి వాళ్ళకు కనబడదు. వచ్చిన వీడియో కాల్ ఫేక్ అని అర్ధమవ్వగానే వెంటనే కాల్ ను క్లోజ్ చేయటంతో పాటు నెంబర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని చెబుతున్నారు. రిపీటెడ్ గా వీడియో కాల్స్ వస్తుంటే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని గట్టిగా పోలీసులు చెబుతున్నారు. మరీ హెచ్చరిక, చిట్కా ఎంతమందికి గుర్తుంటుందో.

Tags:    

Similar News