ఎన్నికల వేళ.. తూగోలో భారీగా నగదు పట్టివేత..

ఎన్నికల వేళ ఆంధ్రలో పోలీసులు కఠినమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. వీటిలో భాగంగా ఈరోజు ఓ బస్సులో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.

Update: 2024-05-02 12:19 GMT

ఆంధ్రలో ఎన్నికల వేళ కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. ఏమాత్రం ధనబల ఎన్నికలు జరగకుండా చూసుకునేలా అన్ని చర్యలు తీసుకున్నారు. అందులో బాగంగానే అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని తరువుగా తనిఖీ చేస్తున్నారు. అది వీఐపీ వాహనమైనా వీవీఐపీ వాహనమైనా తనిఖీ పూర్తయ్యాకే కదలాలి అన్న రీతిలో గస్తీ కాస్తున్నారు పోలీసులు. ఇందులో భాగంగానే గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులో ఈరోజు అంతర్ జిల్లాల చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా అటుగా వచ్చిన ఓ ట్రావెల్స్ బస్సును ఆపి తనిఖీ చేయగగా అందులో భారీ మొత్తంలో నగదు లభించింది.

ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు

ట్రావెల్స్ బస్సులో నగదును తరలిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో అక్కడికు చేరుకుని బస్సును తనిఖీ చేశామని పోలీసులు తెలిపారు. బస్సులో జరిపిన సోదాల్లో రూ.2.40 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఆ డబ్బుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఆ నగదును స్వాధీనం చేసుకున్నామని, దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించామని దేవరపల్లి సర్కిల్ సీఐ బాలసురేష్ బాబు వివరించారు.

Tags:    

Similar News