ఉపరాష్ట్రపతిని ఓ రేంజ్ లో పొగిడిన పవన్ కల్యాణ్

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇటీవల కాలంగా జాతీయ నాయకులపై ఎక్కువుగా స్పందిస్తున్నారు.;

Update: 2025-05-18 08:01 GMT

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌లోని తక్కిన కూటమి నాయకుల కంటే కాస్త ముందు వరుసలోనే ఉండేందుకు ఎప్పటికప్పుడు అలెర్ట్‌గా ఉంటున్నారు. జాతీయ స్థాయిలో ఏ ఇష్యూ తెరపైకి వచ్చినా దాని మీద స్పందించడంలో అందరి కంటే ముందు వరుసలో ఉంటున్నారు.

తాజాగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధంఖర్‌ జన్మదినం పురస్కరించుకొని ఓ పవన్‌ కల్యాణ్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఉపరాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూనే జాతీయ స్థాయి ఇష్యూస్‌లో ఉపరాష్ట్రపతి జగదీష్‌ ధంఖర్‌ జోక్యం చేసుకున్న తీరు, స్పందించిన తీరును పవన్‌ కల్యాణ్‌ అభినందించారు.
పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే..
గౌరవనీయులైన భారత ఉపరాష్ట్రపతి, సీనియర్‌ పార్లమెంటేరియన్‌ జగదీప్‌ ధంఖర్‌ జీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవిలో మీరు ఉన్నందుకు అభినందనలు. రాజ్యసభ ఛైర్మన్‌గా విధులు నిర్వహిస్తూ అందరి గౌరవ, మన్ననలు పొందుతున్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ పార్లమెంట్‌ గౌరవాన్ని పెంపొందిస్తున్నారు. రాజ్యసభ చైర్మన్‌గా మీ వ్యవహార శైలి అందరికీ ఆదర్శనీయం. పార్లమెంటరీ విలువల పవిత్రతను కాపాడంలో మీకు మీరే సాటి. కీలకమైన జాతీయ సమస్యలపై మీరు ఇటీవల చేసిన జోక్యం చేసుకున్న తీరు, స్పందించిన తీరు అద్భుతం. ఇది మీకు, మీ స్థానానికి మరింత గౌరవం తెచ్చిపెట్టింది. తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి మీకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని, దేశానికి మీరు చేస్తున్న విశిష్ట సేవల్లో నిరంతర బలాన్ని అందించాలని ప్రార్థిస్తున్నాను. అంటూ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

Tags:    

Similar News