ఎన్టీఆర్ నట వారసుడిగా..బాలయ్యకు పవన్ అభినందనలు
ప్రేక్షకులను అలరిస్తూ నటనలోను, ప్రజాసేవలో బాలకృష్ణ కొనసాగాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.;
By : The Federal
Update: 2025-08-25 05:34 GMT
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్(లండన్)లో చోటు దక్కించుకున్న ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. నందమూరి తారక రామారావు వారసుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బాలనటుడిగా అడుగు పెట్టి అటు జానపదాలు, ఇటు కుటుంబ చిత్రాలతో పాటు యాక్షన్ సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆ మేరకు సోమవారం సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ స్పందించారు.
పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా అడుగుపెట్టి.. జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో చోటు సాధించిన ప్రముఖ నటులు, హిందూపురం ఎమ్మెల్యే, పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణకి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. అంటూ సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.