పోసాని మీద కేసులే కేసులు
తెరపైకి మరో కేసు వచ్చింది. చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీసు స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదు చేశారు.;
ప్రముఖ సినీ నటుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోసాని కృష్ణమురళి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నరసరావుపేట కోర్టు పోసానికి 10 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు పోసానిని గుంటూరు జైలుకు తరలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య దూషణలు చేశారనే అభియోగాలతో పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 24న మణి అనే జనసేన నాయకుడు రైల్వే కోడూరు నియోజక వర్గం పరిధిలోని ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. దీంతో హైదరాబాద్‌లో అరెస్టు చేసిన పోసానిని రైల్వే కోడూరుకు తరలించారు. రైల్వే కోడూరు కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్‌జైల్లో ఉంచారు.
ఈ విచారణ జరుగుతుండగానే పీటీ వారెంట్‌పై నరసరావుపేట పోలీసులు పోసానిని నరసరావుపేటకు తరలించారు. నరసరావుపే టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో 153, 504, 67 సెక్షన్‌ల కింద పోసానిపై ఇది వరకే కేసు నమోదు చేశారు. దీంతో తాజాగా సోమవారం విచారణ చేపట్టిన పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టు పోసానికి రిమాండ్ విధించింది. విచారణ అనంతరం పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు ఆయనను గుంటూరు కోర్టుకు తరలించారు. మార్చి 13 వరకు పోసానికి రిమాండ్ విధించింది.