చట్టసభలకు 'నో వర్క్... నో పే' అమలు కావాలి..

పార్లమెంట్ స్పీకర్ కు ఏపీ స్పీకర్ అయ్యన్న సూచన;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-09-14 07:30 GMT

దేశంలోని చట్టసభలో ప్రతినిధులకు కూడా 'నో వర్క్ నో పే' ( No work, no pay) విధానం వర్తింపచేయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. అన్ని శాసనసభలు ఏడాదికి 60 రోజులు పనిచేసే విధంగా సూచనలు చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పార్లమెంట్ స్పీకర్ ఓం ప్రకాష్ ను కోరారు.


తిరుపతిలో ఆదివారం ఉదయం రెండు రోజుల మహిళా పార్లమెంటరీ సదస్సు పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుతోపాటు దేశంలోని అన్ని అసెంబ్లీల నుంచి ఐదుగురు వంతున ప్రాతినిధ్యం వహిస్తూ మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు హాజరయ్యారు.
తిరుపతిలో జాతీయ మహిళా పార్లమెంటరీ ప్రతినిధుల రెండు రోజుల సదస్సులో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ,

ఏపీ అసెంబ్లీ స్పకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు

"ఉద్యోగులు విధులకు గైర్హాజరైతే నో పే అంటున్నాం. లేదంటే సస్పెండ్ చేస్తున్నాం. ఈ విధానం చట్టసభలకు ఎందుకు వర్తించదు? ఖచ్చితంగా వర్తింపచేయాలి. దీనిపై ఆలోచన చేయండి" అని పార్లమెంట్ స్పీకర్ ఓం ప్రకాష్ కు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు.
రాష్ట్రంలో కొందరు సభ్యులు శాసనసభకు హాజరు కావడం కావడం లేదని వైసిపి ఎమ్మెల్యేలను ఉద్దేశించి వారి పేర్లు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిపై ఏపీలోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా చర్యలు తీసుకునే విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. ప్రజాప్రతినిధులు బాధ్యతలు మరిపోెయి వ్యవహరించడం సరైంది కాదని ఆయన అన్నారు.
పనిదినాలు పెరగాలి..
ప్రజాసమస్యలపై చర్చించడానికి చట్టసభల పనిదినాలు పెంచాల్సిన అవసరాన్ని కూడా స్పీకర్ అయ్యన్నపాత్రుడు గుర్తు చేశారు.
"ప్రస్తుతం ఏడాదికి 30 నుంచి 35 రోజులు మాత్రమే సభ జరుగుతోంది. దీనివల్ల అన్ని అంశాలు చర్చించడానికి కష్టంగా ఉంది. అన్ని శాసనసభలు ఏడాదికి 60 రోజులకు తగ్గకుండా పని చేసేందుకు సూచనలు జారీ చేయండి" అని అయ్యన్నపాత్రుడు పార్లమెంటు స్పీకర్ ఓం ప్రకాష్ ను  ఉద్దేశించి కోరారు.
కమిటీలు బలోపేతం కావాలి

తిరుపతిలో జాతీయ  మహిళా పార్లమెంటరీ సదస్సుకు హాజరైన ప్రజాప్రతినిధులు

శాసనసభ కమిటీలు బలోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. శాసనసభ కమిటీ లో ఉన్న మహిళలు, వారి సారథ్యంలోని కమిటీ చైర్మన్ లు మహిళా సాధికార తో పాటు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకొని శాసనసభకు సిఫారసు చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచన చేశారు.
అసెంబ్లీలో అన్ని సమస్యలు చర్చించడం, పరిష్కారం చేయడం అనేది ఇబ్బందితో కూడుకున్నది. ఆ బాధ్యతలు శాసనసభ కమిటీలు ప్రధాన బాధ్యతగా తీసుకోవాలని" అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు.
దేశంలో మహిళా సాధికారతకు ఏపీ పెద్దపీట వేసిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, మాజీ సీఎం ఎన్టీ రామారావు కాలంలోనే మహిళలకు ఆస్తి హక్కును తీసుకువచ్చిన ఘనత దక్కించుకున్నారని అయ్యన్నపాత్రుడు గుర్తు చేశారు. విద్య, ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా మహిళలకు పెద్దపీట వేసిన ఘనత టిడిపికి దక్కిందని ఆయన చెప్పారు.
రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారని చెబుతూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి, గుమ్మడి సంధ్యారాణి, ఎస్ సవితను జాతీయ సదస్సులో చింతకాయల అయ్యన్నపాత్రులు పరిచయం చేశారు. మిగతా రాష్ట్రాలలో కూడా మహిళలను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా మహిళ సాధికారతను పెంచడానికి వీలుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.
మంచి నిర్ణయాలు తీసుకోండి

తిరుపతిలో ప్రారంభమైన రెండు రోజుల పార్లమెంటరీ మహిళా సాధికారత సదస్సులో మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచన చేశారు. ₹శాసనసభలో లేదా పార్లమెంట్లో విభిన్న పార్టీలు ఉండవచ్చు. రాజకీయాలు వేరు. మహిళలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలకు జెండాలు పక్కన ఉంచి ఒకే అజెండాతో నిర్ణయాలు తీసుకోండి" అని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు దిశా నిర్దేశం చేశారు.
రాష్ట్రాన్ని విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ కాలం నుంచి మహిళల సాధికారత కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు స్పీకర్ అయిన పాత్రుడు వివరించారు. "మాజీ సీఎం ఎన్టీఆర్ కాలంలో మహిళలకు ఆస్తి హక్కు కల్పిస్తే, వస్తా సీఎం నారా చంద్రబాబు మహిళా శక్తిని మరింతగా బలవపేతం చేయడానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థిక స్థిరత్వం సాధించే దిశగా స్నేహ హస్తం అందించారు" అని స్పీకర్ అయిన పాత్రుడు వివరించారు.
మహిళా సాధికారతకు, వారి హక్కులకు మరింత ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలో స్త్రీ శక్తి పేరిట ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయాన్ని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని కూడా స్పీకర్ అయ్యన్న వివరించారు. ఏపీ శాసనసభ మాదిరే దేశంలోని అన్ని చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. అవకాశాలను అందిపుచ్చుకొని మహిళలు రాజకీయాల్లో కూడా మరింత అజయ్ శక్తిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అంతకుముందు  ఈసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. సభకు అధ్యక్షత వహించిన ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మహిళా సాధికారితపై సందేశం ఇచ్చారు.
Tags:    

Similar News