కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మా... నీకిక లేదమ్మా ఢోకా...

ప్రపంచంలో గుర్తింపు పొందిన కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మల తయారీకి కావాల్సిన కలప చెట్లను ప్రభుత్వమే పెంచేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు వెలువడ్డాయి.

Update: 2024-10-23 06:07 GMT

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు పుట్టినిల్లు. ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మలు దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ ప్రసిద్ధి కాంచినవి. ఈ బొమ్మలు అక్కడి కళాకారులు చేతలతోనే తయారు చేస్తారు. మంచిగా నగిషీలు చెక్కి చూపరులను ఆకట్టుకునేలా చేస్తారు. ఈ బొమ్మల్లో మన సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడుతుంటాయి. పైగా బొమ్మలు తెల్ల పొణికి చెక్కతో తయారు చేస్తారు. టేకు చెక్కకంటే స్మూత్ గా ఉండటం వల్ల బొమ్మలు అందంగా కనిపిస్తాయి. మంచి డిజైన్లతో బొమ్మలు ఉంటాయి. పెళ్లి, ఇల్లు, పిల్లలు వంటి బొమ్మలు ఇట్టే ఆకట్టుకుంటాయి.

Delete Edit

ఇటీవల కాలంలో ఈ బొమ్మల తయారీకి ఉపయోగించే అంకుడు, తెల్ల పొణికి చెట్లు కనుమరుగవుతూ వచ్చాయి. చెక్క అందుబాటులో లేకపోవడంతో వేరే కలపతో బొమ్మలు తయారు చేయాల్సిన పరిస్థితి అక్కడి కళాకారులకు వచ్చింది. వేరే కలపతో బొమ్మలు తయారు చేస్తే ఫినిషింగ్ సరిగా ఉండవు. ఇతరులను ఆకట్టుకోలేవు. ఆ విషయాన్ని ఇటీవల వారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలిపారు. ఏటికొప్పాక బొమ్మల తయారీకి ముడి సరుకుగా ఉపయోగపడే అంకుడు కర్ర, కొండపల్లి బొమ్మలకు అవసరమయ్యే తెల్ల పొణికి చెట్లను విస్తారంగా పెంచాలని అధికారులను పవన్‌ కళ్యాణ్‌ ఆదేశించారు. కలప లేని కారణంగా రానురాను మా కళ కూడా దెబ్బతింటోందని వారు పవన్ కు చెప్పారు. వారి విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్ ఈ చెట్లను అడవులు, ఖాళీ స్థలాల్లో పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. వెంటనే అధికారులను ఆదేశించారు.

Delete Edit

ఉప ముఖ్యమంత్రి.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆ కళాకారులకు అందుబాటులో ఉండేలా అంకుడు, తెల్ల పొణికి చెట్లు పెంచడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా అంకుడు, తెల్ల పొణికి చెట్లు పెంచాలన్నారు. అటవీ ప్రాంతాల్లోనూ… ఏటికొప్పాక, కొండపల్లి పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ, అటవీ, సామాజిక స్థలాల్లో వీటి పెంపకంపై దృష్టి సారించాలన్నారు.

Delete Edit

ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అంకుడు, తెల్ల పొణికి చెట్లు పెంపకానికి తగిన చర్యలు అధికారులు తీసుకున్నారు. భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకొని కనీసం రెండు మూడు తరాలకు సరిపడా చెట్లను పెంచేలా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ కృష్ణ తేజ ఆదేశాలు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ హస్త కళలను ప్రోత్సహించే దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర అతిథులను గౌరవపూర్వకంగా సత్కరించే సందర్భంలో అందించే బహుమతులుగా ఆంధ్రప్రదేశ్‌ కళాకారులు తీర్చిదిద్దిన కళాకృతులను ఎంపిక చేసి వాటినే ఇస్తున్నారు. ఈ కళాకారులు రూపొందించిన బొమ్మలకు మంచి గిరాకీ ఉంది. ప్రస్తుతం ఆన్లైన్లో కూడా ఈ బొమ్మలు అందుబాటులో ఉన్నాయి.

Tags:    

Similar News