ఏపీలో పేలిన ‘నాటు తుపాకీ’
ఓ వ్యక్తి భార్యాభర్తలపై దాడి చేసి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు.;
By : The Federal
Update: 2025-08-04 08:15 GMT
ఆంధ్రప్రదేశ్‌లో నాటు తుపాకీ పేలింది. దీంతో ఏపీ ఒక్క సారిగా ఉలిక్కిపడింది. తనను కాదని మొదటి భర్త వద్దకు తన ప్రియురాలు వెళ్లడంతో కసితో రగిలి పోయిన ఓ దుండగుడు తన వద్ద ఉన్న నాటు తుపాకీతో దాడి చేశాడు. తన ప్రియురాలుతో పాటు ఆమె మొదటి భర్తపైన నాటు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. భార్యాభర్తలకు గాయాలు కావడంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలం పెద్దమల్లాపురం పంచాయతీ పరిధిలోని శృంగధారలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది.
శంగధార గ్రామంలో నివాసం ఉంటున్న దంపతుల్లో భార్య పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో ఆ ఇద్దరు కొన్నేళ్లుగా సహజీవనం సాగించారు. అయితే వీరద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో ఆమె ప్రియుడి నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. దీంతో తన ప్రియుడిని దూరంగా పెట్టాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఆమె తన మొదటి భర్త వద్దకు వెళ్లిపోయింది. దీంతో ప్రియుడు తన ప్రియురాలిపైన ద్వేషం పెంచుకున్నాడు. ఆమెను కడతేర్చాలని పగతో రగలిపోయాడు.
అదును కోసం ఎదురు చూశాడు. సోమవారం ఉదయం తన ప్రియురాలి ఇంట్లోకి చొరబడి భార్యాభర్తలిద్దరిపైన దాడి చేశారు. తన వద్ద ఉన్న నాటు తుపాకీతో ఇద్దరిపైన కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఆ భార్యాభర్తలిద్దరికీ గాయాలయ్యాయి. స్థానికులు వారిద్దరినీ కాకినాడ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అన్నవరం ఎస్‌ఐ శ్రీహరిబాబు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేపట్టారు. దుండగుడి కోసం పోలీసులు గాలింపులకు దిగారు. అయితే బాధితులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.