యువగళం ఓ మధుర జ్ఞాపకం
ఎన్నో కష్టాలు పడ్డాను. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నాను. చివరికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నామంటూ లోకేష్ పేర్కొన్నారు.;
By : Admin
Update: 2025-01-27 13:35 GMT
ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు కుటుంబం అంతా రోడ్లపై కొచ్చారు. చంద్రబాబు ఓ పక్క తిరుగుతుంటే.. ఆయన భార్య నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో మరో వైపు, వారి కొడుకు నారా లోకేష్ మరో వైపు యువగళం పాదయాత్రను చేపట్టారు. లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కూడా పర్యటనలు చేశారు. అలా ఎన్నికల ముందు చేపట్టిన వారి యాత్రలు ఎన్నిల్లో మంచి ఫలితాలను తెచ్చి పెట్టాయి. అధికారంలో కూర్చో పెట్టాయి. తాజాగా లోకేష్ తాను చేపట్టిన యువగళం పాదయాత్ర గురించి స్పందించారు. ఓ కేసు నిమిత్తం విశాఖపట్నం వెళ్లిన ఆయన తన పాదయాత్ర గురించి నెమరేసుకున్నారు.
యువగళం పాదయాత్ర నాకు జీవితకాలం గుర్తుండిపోయే అరుదైన జ్ఞాపకం. నియంతృత్వాన్ని, నిర్బంధాలను దాటుకొని రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 2,097 గ్రామాలు మీదుగా 226 రోజులపాటు 3132 కి.మీ. సాగిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర మొదలై నేటికి రెండేళ్లు. నాటి పాలకులు పాదయాత్ర ఆపడానికి చెయ్యని ప్రయత్నం లేదు. మైక్ వెహికల్ సీజ్ చెయ్యడం దగ్గర నుండి వాలంటీర్లును అరెస్టు చేయడం వరకూ అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు. నాటి పాలకులు ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజలు చూపించిన ప్రేమ నన్ను మరింత దృఢంగా మార్చింది. పాదయాత్ర ప్రతి అడుగులో ప్రజల కష్టాలు చూసాను. ఆ రోజు చూసిన కన్నీటి గాథలు నేటికీ నాకు గుర్తున్నాయి. ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది. ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. హామీలు అన్ని క్రమ పద్ధతిలో అమలు చేస్తున్నాం. యువగళం పాదయాత్రలో ప్రత్యక్షంగా– పరోక్షంగా భాగమైన ప్రతి ఒక్కరికీ, నన్ను ఆదరించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. అంటూ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశమయ్యాను. ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ఇంటింటికి వెళ్లి నేతలు వివరించాలని సూచించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు సంస్థాగత అంశాలపై చర్చించారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ సహకరిస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలు 7 నెలల్లోనే పరిష్కరించాం. అనేక ఐటి కంపెనీలు, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ చేయాలి అంటూ పార్టీ కేడర్‌కు ఆదేశాలు జారీ చేశారు.