చిన్నారులకు పెట్టే గుడ్డును కూడా వదలని జగన్.. మండిపడ్డ లోకేష్

దోచుకోవడమే పరమావధిగా పాలన సాగించడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సాటి ఎవ్వరూరారంటూ ప్రస్తుత మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-04 14:34 GMT

దోచుకోవడమే పరమావధిగా పాలన సాగించడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సాటి ఎవరూ రారంటూ ప్రస్తుత మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఖరికి చిన్నారులకు వారానికోసారి పెట్టే గుడ్డును కూడా వదలకుండా జగన్ స్కామ్ చేసి డబ్బులు దండుకున్నారని తేటతెల్లమైందని లోకేష్ వెల్లడించారు. అక్రమార్జన కోసం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తి ఇంత దిగజారుతాడని తాను కలలో కూడా ఊహించలేదని, ఇంతటి నీఛ నేతనా గతంలో మేము ఎన్నుకుంది అని ప్రజలు ఇప్పుడు కూడా చింతిస్తున్నారని లోకేష్ దుయ్యబట్టారు. చిన్నారులకు మేమమాలా ఉండి వారి యోగక్షేమాలు చూసుకుంటానని, పౌష్టికాహారం అందిస్తానని చెప్పిన జగన్.. అంతా మాయ చేశారని, మధ్యాహ్న భోజన పథకం అమలులో అనేక అవకతవకలకు పాల్పడ్డారని లోకేష్ విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై సంబంధిత అధికారులతో నారా లోకేష్.. సెక్రటేరియట్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తనకు విస్తుబోయే విషయాలు, జగన్‌కు సంబంధించిన చేదు నిజాలు తెలిశాయని చెప్పారు లోకేష్.

గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇవ్వాల్సిన గుడ్డు ఇవ్వడం లేదని అధికారులు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. అందుకు కారణం ఏంటని ప్రశ్నించగా.. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే విద్యార్థులకు గుడ్ల పెట్టడం నిలిపివేయడం జరిగిందని స్పష్టమైనట్లు లోకేష్ వెల్లడించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఎన్నాళ్టి నుంచి గుడ్డు పంపిణీ కావట్లేదు.. ఆ సమయంలో సదరు పాఠశాలలకు ఇవ్వాల్సిన గుడ్లు ఏమయ్యాయి? వంటి అంశాలకు సంబంధించిన వివరాలను వెంటనే సమీకరించి తనకు అందించాలని ఆదేశించారు.

గుడ్లకు బకాయిలు పెట్టిన జగన్

అంతేకాకుండా ఇవ్వని గుడ్లకు సంబందించి గత సీఎం జగన్ భారీగా బకాయిలు కూడా పెట్టారని మండిపడ్డారు నారా లోకేష్. ‘‘డిసెంబర్ నుంచి గుడ్ల కాంట్రాక్టర్లకు రూ.112.5 కోట్లు, చిక్కీల కాంట్రాక్టర్లకు గతేడాది ఆగస్టు నుంచి రూ.66 కోట్ల బకాయిలు పెట్టింది గత ప్రభుత్వం’’ అని వివరించారు. ఈ పెండింగ్ బిల్లులు అధికంగా ఉండటంతోనే గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని పలు పాఠశాలల్లో గుడ్లు సరఫరాను కాంట్రాక్టర్లను నిలిపివేశారని తమకు అందిన ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసిందని లోకేష్ వివరించారు. కానీ ‘‘కొన్ని నీలి మీడియా సంస్థలు మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే విద్యార్థులకు ఇచ్చే గుడ్లను నిలిపివేసిందంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది’’ అని మండిపడ్డారు. అంతేకాకుండా విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో కూడా బకాయిలు పెట్టడంపై లోకేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు లోకేష్. ఆ బకాయిలను తాము సత్వరం చెల్లిస్తామని, వెంటనే విద్యార్థులకు గుడ్డు పంపిణీని పునరుద్దరించాలని సదరు అధికారులకు ఆదేశించారు లోకేష్.

సమర్థవంతంగా అమలు చేయాలి

‘‘మధ్యాహ్న భోజన పథక కాంట్రాక్టర్లందరూ కూడా పథకాన్న సమర్థవంతంగా అమలు చేయడానికి సహకరించాలి. ఏమాత్రం అలసత్వం, నిర్లక్ష్యం పనికిరాదు. నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులను అందించాలి. వారికి నాణ్యమైన విద్య ఎంత అవసరమో నాణ్యమైన ఆహారం కూడా అంతే అవసరం. కావున విద్యార్థులకు సంబందించిన ఏ పథకం అమలు విషయంలో కూడా అసలత్వాన్ని ఉపేక్షించేది లేదు’’ అని నారా లోకేష్ హెచ్చరించారు.

Tags:    

Similar News