'మిమ్మల్ని ధనికులను చేయాలనేదే నా కోరిక'
కుప్పం నియోజకవర్గం తిమ్మరాజుపల్లెలో సీఎం చంద్రబాబు 'సుపరిపాలన' తొలిఅడుగు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-02 17:18 GMT
ప్రభుత్వ పాలన ఎలా ఉందమ్మా? పథకాలు బాగా అందుతున్నాయా? అని సీఎం ఎన్. చంద్రబాబు కుప్పం ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నారు.
"మిమ్మల్ని ధనికుల చేయడానికి కష్టపడుతున్నా"అని సీఎం చంద్రబాబు అనడంతో.. గ్రామస్తులు కూడా స్పందించారు.
"మా అన్న మా ఇంటికి వచ్చినట్లే ఉంది" అని సరస్వతి అనే మహిళ అనడంతో సీఎం చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు.
కుప్పం అనేది నా కుటుంబం. అన్ని రకాలుగా వృద్ధిలేకి తీసుకురావడానికి నిరంతరం ఆలోచన చేస్తున్న. కార్యక్రమాలు అమలు చేస్తున్న చంద్రబాబు ఊరడించారు.
కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటన కోసం బుధవారం నిర్ణీత సమయానికంటే సుమారు మూడు గంటల ఆలస్యంగా చేరుకున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించని స్థితిలో హెలికాప్టర్లో కాకుండా బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన ఆయన కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం తుమ్మిసి గ్రామం వద్ద ఉన్న బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత..
టిడిపి కూటమి ఏర్పడి ఏడాదైన సందర్భంగా.. "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నిర్వహించారు.
తిమ్మరాజు పల్లి లో పండగ
కుప్పం ఎమ్మెల్యేగా సీఎం చంద్రబాబు శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లెలో బుధవారం రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో సుపరిపాలనలో తొలి అడుగు వేశారు. ఆయన రాకకు ముందే తిమ్మరాజు పల్లె మొత్తం సుందరంగా అలంకరించారు. ప్రతి ఇంటిని పూలతో ముస్తాబు చేశారు. దీంతో తిమ్మరాజు పల్లె మొత్తం పండుగ వాతావరణంలో ఓలలాడింది. అధికార దర్పం, మంది మార్బలాన్ని పక్కన వచ్చిన సీఎం చంద్రబాబు ఎంపిక చేసిన ప్రతి ఇంటిని సందర్శించారు. వారితో కూర్చుని పెద్దకొడుకుల సమస్యలు తెలుసుకున్నారు. అవసరమైన సాయం మంజూరు చేశారు. పిల్లల చదువులకు అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకున్నారు.
ఆటో మంజూరు
వెంకటేష్ దంపతులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
తిమ్మరాజు పల్లి లోని వెంకటమ్మ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్నారు. ఆమె కొడుకు వెంకటేష్, కోడలితో మాట్లాడారు. వారికి ఎలక్ట్రిక్ ఆటో, జీవనాధారానికి రెండు ఆవులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. డ్వాక్రా మహిళల సారధ్యంలో నాలుగు ఎకరాల్లో పశుగ్రాసం పెంచడానికి అవసరమైన సలహాలు కూడా వారి నుంచి తీసుకున్నారు.
మా ఇంటికి మా అన్న వచ్చాడు
తిమ్మరాజుపల్లిలోని సరస్వతి దంపతుల ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు.
"ఏమ్మా ఎలా ఉన్నావ్" అనగానే..
"మాకు దిగులు ఎందుకన్నా. మా ఇంటికి మా అన్న వచ్చినాడు. ఇదే మాకు ధైర్యం" అని సరస్వతి అన్నారు. సీఎం చంద్రబాబు ఆ కుటుంబంలోని అందరిని పక్కన కూర్చోబెట్టుకుని ఆనందం వ్యక్తం చేశారు. కొద్దిసేపు మాటలు కూడా రాని స్థితిలో ఊకొడుతూ కూర్చున్నారు. సరస్వతి కొడుకు చంద్రయ్య ఇంటర్ చదువుతున్నాడని తెలుసుకొని ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వడంతో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివించడానికి ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కుటుంబ పోషణకు ఇబ్బందులు లేకుండా ఆవులు కూడా మంజూరు చేయిస్తాను అని వారికి చంద్రబాబు ఇచ్చారు.
గ్యాస్ డబ్బు పడలేదు
ప్రభుత్వం ఎలా ఉంది అని మరో ఇంటికి వెళ్లిన చిలకమ్మ సీఎం చంద్రబాబు. ఇంట్లో బాత్రూం లేదా? గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయా? డబ్బులు పడుతున్నాయా? అని ఆయన వాకబు చేశారు.
"గ్యాస్ డబ్బులు పడలేదు" అని చిలకమ్మ చెప్పగానే సీఎం చంద్రబాబు కాస్త ఇబ్బంది పడిన, తల్లికి వందనం డిపాజిట్ అయిందా అని అడిగారు. ఆ సొమ్ము వచ్చిందని చెప్పగానే, ఒకసారి బ్యాంకు ఖాతాలో చెక్ చేసుకోండి అనే సీఎం చంద్రబాబు సూచించారు.
వారి కుటుంబం గురించి ఆయన తెలుసుకున్నారు. కీర్తి గురుకుల పాఠశాలలో ఉందని, స్వాతి ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు చిలకమ్మా వివరించింది.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని తన కోరికను స్వాతి వ్యక్తం చేయగానే సీఎం చంద్రబాబు మొహంలో ఆనందం కనిపించింది.
ప్రభుత్వ పనితీరును కూడా వారి నుంచే ఆయన తెలుసుకున్నారు. ఆ తర్వాత చిలకమ్మ కుటుంబానికి సాయం అందించడానికి కూడా హామీ ఇచ్చారు.
ఇలా ప్రతి ఇంటికి వెళ్లిన cm చంద్రబాబు ఆ కుటుంబంలోని ఇబ్బందులు, జీవన విధానాన్ని పూర్తిగా తెలుసుకున్నారు. సిమెంట్ రేకులు, గోడలకు పూత కూడా వేయని ఇంటి స్థితిని చూసి వారికి ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు అవసరమైన ఆదేశాలను అక్కడికక్కడే జారీ చేశారు.