హోం మంత్రి అనితకు మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు క్లాస్‌

శాంతి భద్రతలపై ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో గందరగోళం. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు.

By :  Admin
Update: 2024-11-18 09:16 GMT

బాధ్యత కలిగిన రాష్ట్ర మంత్రి అయ్యుండీ, గౌరవప్రదమైన పదివిలో ఉండీ, దమ్ము, ధైర్యమని సభలో ప్రతిపక్ష సభ్యుల గురించి మాట్లాడటం కరెక్టు కాదని ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు హోం మంత్రి వంగలపూడి అనితకు క్లాస్‌ పీకారు. గౌరవంగా చర్చలు జరుపుకోవాలసిన సభలో దమ్మూ, ధర్యమంటూ మాట్లాడటం ఏంటని మంత్రి అనితను ప్రశ్నించారు. ఇలా మాట్లాడటం సరైంది కాదని, సభ్యతగా మాట్లాడాలని, సజావుగా చర్చలు జరిగేందుకు సహకరించాలని మంత్రికి సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో సోమవారం శాంతి భద్రతలపై చర్చ సాగింది. దీనిపై ఇటీవల చోటు చేసుకున్న అత్యాచారాలు, హత్యలుపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం వల్లే ఇవి జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. దిశా యాప్, చట్టాన్ని నిర్వీర్యం చేశారని విమర్శలు గుప్పించారు. దీనిపై హోం మంత్రి వంగలపూడి అనిత బదులిస్తూ జగన్‌ ప్రభుత్వ హయాంలోనే అధికంగా ఈ సంఘటనలు జరిగాయని ప్రతి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. మండలి వైఎస్‌ఆర్‌సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల వైపల్యాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీంతో హోం మంత్రి అసనహనానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్లు బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అప్పటికే మాట్లాడుతున్న హోం మంత్రి అనిత దమ్ము, ధైర్యం ఉంటే సభలోనే వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు కూర్చోవాలని వ్యాఖ్యలు చేయడంతో మండలి చైర్మన్‌ కొయ్యే మేషేన్‌ రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం వైఫల్యమైందని, హోం మంత్రి అనిత అనుచిత వ్యాఖ్యలకు మండలి నుంచి వాకౌట్‌ చేశారు.
Tags:    

Similar News