రంగుల ముగ్గులే... జీవనయానం

ఇంటి ఆవరణ ముందు కళాకృతులతో తీర్చిదిద్దే ముగ్గులు కొత్త అందం తెస్తుంది. చిన్నపరికరంతో యుక్తితో ముగ్గులు తీర్చిదిద్దుతున్న ఈ వ్యక్తి కుటుంబం భుక్తి పొందుతోంది. ఇదే తరహాలో వందల కుటుంబాలు జీవనయానం సాగిస్తున్నాయి. కాదు.. కాదు.. తెలుగువారి ఆచారాలకు జీవం పోస్తున్నాయి. ఈయన బతుకుపోరాటం ఎలా సాగుతోందంటే..

Update: 2024-08-04 08:31 GMT

తెలుగువారే కాదు. దేశ సంస్కృతీ, సంప్రదాయాలను ముగ్గులు ప్రతిబింబిస్తాయి. శుభకార్యక్రమాలకు సంకేతం ముగ్గులు. ఇంటి ముందు పేడతో కళ్లాపి చల్లడం, అందులో చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు వేసి, రంగులు అద్దడం ద్వారా ఆకర్షణీయంగా తీర్చదిద్దడానికి మగువలు ఆసక్తి చూపుతారు. ఈ ముగ్గులు మన సంస్కృతిని ప్రతిబింబించడమే కాదు. ఆ ఇంటి సౌభాగ్యానికి కూడా ఓ ఉపయోగపడుతుందనేది గట్టి విశ్వాసం. ఇంటిముందు కనిపించే ముగ్గులు ప్రత్యేక ఆక్షణగా ఉంటాయి. అయితే మారుతున్న కాలంలో పెరుగుతున్న పట్టణీకరణ వల్ల ముగ్గులు వేసే స్థలం లేకుండా పోతోంది. అయినా, గడప ముందు శాశ్వతమైన రంగులతో రంగవల్లలు తీర్చిద్దడంలో అశ్రద్ధ చేయడం లేదు. గదుల్లో కూడా ముగ్గులతో తీర్చిదిద్దిన ప్లాస్టిక్ స్టిక్కర్లు అతికించడం ద్వారా అలంకరణకు, శాస్త్రీయతకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

మారుతున్న కాలంలో ఆచార వ్యవహారాలు మరుగున పడుతున్నాయి. గ్రామీణ జీవనంలో కూడా మార్పులు తీసుకొస్తోంది. ఈ మాట ఆట ఉంచితే.. యాంత్రిక ప్రపంచంలో అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో ఇంటి ముంగిట పెయింటింగ్ తో సరిపోతుంది. ఇంటి లోపల అలంకరణ వస్తువులతో నింపేస్తున్నారు.

ముగ్గులు వేయడం వెనెక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. ఆచార, సంప్రదాయాలు అనేక అర్థాలు, పరమార్ధాలతో నిండి ఉంటాయి. ఇంటి లోగిళ్లు కళకళ లాడేది ముగ్గులతోనే. వీటినే రంగవల్లలు అని కూడా పిలవడం తెలసిందే. ఇల్లు, దేవుడి మందిర, తులసికోట, ఇంటిపెరట్లో వేసే ముగ్గులకు కూడా శాస్త్రీయమైన కోణాలు ఉన్నాయి. ఇంటి ముంగిట ముగ్గులు కొత్త అందాన్ని తెస్తాయి. ఆ ఇంటికి వెలుగులు ప్రసాదిస్తాయి. ముగ్గులు సంప్రదాయానికి నిలువెత్తు సాక్ష్యం.


ఇక్కడ కనిపించే వ్యక్తి పేరు పురుషోత్తం. దేశసంస్కృతీ, సంప్రదాయాలు కాపాడుకోవాలని పరోక్ష సందేశం ఇస్తున్నారు. సులభంగా, అందంగా ముగ్గులు వేయవచ్చని చూపిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ముగ్గుపిండి, అందులో వేసే రంగు పొడితో నింపిన చిన్నపాటి పరికరాలతో అందమైన కళాకృతులు తీర్చిదిద్దుతున్నారు. తక్కువ ధరకు విక్రయిస్తున్న ఈ వస్తువులతో జీవనం సాగిస్తున్నారు. తన తండ్రి వారసత్వంగానే ఈ వృత్తిని ఎంచుకున్నట్లు ఆయన చెబుతున్నారు.
ఆధ్యాత్మికతకు నెలవైన తిరుపతికి వచ్చే యాత్రికులకు ఈ వస్తువులు విక్రయించడం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. ఈయన ఒక్కరే కాదు. ఈ తరహాలో వందల మంది కుటుంబాలు జీవితం సాగిస్తున్నాయి. ఇతని చేతిలోని చిన్నపాటి వస్తువు ద్వారా నేలపై పరుచుకుంటున్న చక్కటి ముగ్గులు చూసి, మహిళలు ముగ్ధులవుతున్నారు. ఆ పరికరాలు కొనుగోలు చేయడం ద్వారా అతని జీవనోపాధికి ఊతం ఇస్తున్నారు. అనడం కంటే తెలుగువారి ఆచార వ్యవహారాలకు జీవం పోస్తున్నారని చెప్పవచ్చు.
దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే యాత్రికులతో ఆయన వారి యాస, భాషలు కూడా ఒంటబట్టించుకుని, మాటలతో వారిని మరిపించి, తన వద్ద ఉన్న చిన్న ముగ్గల పరికరాలు కొనుగోలు చేయించడంతో భుక్తి సంపాదించుకుంటున్నారు.

"యాత్రికుల నుంచి నేను తమిళం, కన్నడం, హిందీ, మలయాళం కూడా నేర్చుకున్నా" అని చెబుతున్న పురుషోత్తం చేతిలో రూపుదిద్దుకుంటున్న అందమైన ముగ్గులు. ఆకట్టుకుంటున్నాయి.
తిరుపతిలోని కపిలితీర్థం సర్కిల్ వద్ద తారసపడిన పురుషోత్తంను పలకరించగా, తన జీవనాన్ని ఇలా పంచుకున్నారు.
"మా నాయన వెంకటయ్య.. ఇలాగే ముగ్గులు వేసే చిన్నపాటి పరికరాలు విక్రయించి జీవనం సాగించారు. నన్ను, మా తమ్ముళ్లు, ఇద్దరు , చెల్లెలిని పెంచి పోషించాడు" అని ఫెడరల్ ప్రతినిధికి చెప్పాడు.
"మా నాన్న చనిపోయాడు. అంతకుముందే నేను ఈ వృత్తిలోకి వచ్చా. మా తమ్మడు పెట్రోల్ బంకులో పనికి పోతాడు. మా చెల్లికి పెళ్లి చేశా" అని చెబుతున్న పురుషోత్తం కొంతవేదన కూడా చెందాడు.

"తిరుపతిలో రెండు, మూడు సత్రాలు కూల్చివేసిన తరువాత ఉపాధికి కొంత దెబ్బ తగిలింది. అందుకే యాత్రికులు ఎక్కువగా ఉన్న కపిలతీర్థం, గోవిండరాజస్వామి గుడి, అలిపిరి వద్ద నేను ఈ వస్తువులు విక్రయిస్తున్నా" అని పురుషోత్తం చెబుతున్నాడు.


ఇంట్లోనే తయారు చేస్తా...

ముగ్గులను అందంగా తీర్చిదిద్దుతున్న పురుషోత్తంకు ముగ్గులు వేసే చిన్న పరికరాలు తయారీలో నేర్పరి. అందుకు ఏమి చేస్తున్నాడంటే...
"అల్యూమినియం రేకును పద్దతిగా ఒంపులు తిప్పుతా. డిజెన్ తో కూడిన రంద్రాలు వేస్తా. ఆ తరువాత దానికి హ్యండిల్ కూడా అమరుస్తా"
ప్లాస్టిక్ పైప్ ధర తక్కువ. పొడవాటి పైప్ జానెడు పొడవు కత్తిరిస్తా. దానికి వివిధ డిజైన్లు వచ్చే విధంగా రంద్రాలు వేస్తా. నా భార్య కూడా సహకారం అందిస్తుంది"
వాటిని జత రూ. 30 కి విక్రయిస్తా" అని పురుషోత్తం తన జీవనాన్ని ఆవిష్కరించారు.



వందల మందికి ఇదే ఉపాధి
తిరుపతి నగరం ఇందిరానగర్ ( కొత్తఇండ్లు) ప్రాంతంలోని పదుల సంఖ్యలో కుటుంబాలకు ఇదే జీవనం. సిల్వర్ రేకులు, ప్లాస్టిక్ పైపు కట్ చేసి, వివిధ రకాల డిజైన్లు వచ్చే విధంగా వాటికి రంద్రాలు వేసి, చిన్న పాటి వస్తువులు తయారు చేస్తారు. వాటిలో నున్నగా ఉన్న ముగ్గు పిండి, రంగుపొడులు చిన్న బ్యాగులో తీసుకుని యాత్రికుల రద్దీ ఉన్న ప్రాంతాలకు వెళతారు. చిన్నగా ఉన్న సిల్వర్ అచ్చులో ఒకపక్క పిండి, పక్కనే రంగు పొడి వేసి, నేలపై మెల్లగా లాక్కుని వెళితే అందమైన ముగ్గు కళాకృతి ఏర్పడుతుంది. ఆ ముగ్గు చూసేవారిని కన్నురెప్పలు వాల్చరు అంటే ఎంతమాత్రం అతిశేయోక్తి కాదు.

తిరుపతి నగరానికి వాహనాల్లో వచ్చి, కపిలతీర్ధం, అలిపిరితో పాటు శ్రీనివాసం, రైల్వే స్టేషన్ సమీప ప్రాంతంలో సేదదీరుతున్న యాత్రికుల సమీపంలో నేలపై ఇలా మొడల్ గా ఇలాముగ్గులు తీర్చిదిద్దుతుంటారు. అందమైన ముగ్గులను చూసి ఆకర్షితులయ్యే మహిళలు ఎక్కవగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ తరహా తెలికపాటి వ్యాపారంతో వందలాది మంది జీవనం సాగిస్తున్నట్లు పురుషోత్తం చెబుతున్నారు.

సరిహద్దులు దాటరు..
పేదలైనా వారి మనసు పెద్దది. ఒకరి బతుకుదెరువును మరొకరు దెబ్బతీసుకోరు. వారికి కట్టుబాట్లు ఉన్నాయి.
"తనతో పాటు ఇంకొకరు కూడా బతకాలి అనే నీతి సూత్రానికి" కట్టుబడి ఉంటారు. ఎలాగంటే, శ్రీనివాసమంగాపురం (పెరుమాళ్లపల్లె) వద్ద కూడా కొన్ని కుటుంబాటు ఉన్నాయి. వారంతా తిరుమలలో ఈ చిన్నపాటి ముగ్గులు వేసే వస్తువులు విక్రయిస్తారు. తిరుపతిలో ఉన్న వారు తిరుచానూరు పద్మావతిపురంలోని అమ్మవారి ఆలయం వద్ద చేతిలో ఉన్న బ్యాగులో వస్తువులు వేసుకుని తిరుగుతూ విక్రయిస్తారు. కొందరు మాత్రం తిరుపతిలోని ఆలయాలు, యాత్రికులు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో విక్రయాలు సాగిస్తారు. ఎవరు కూడా తమ ప్రదేశాలకు మినాహాయించి వెళ్లరు. ఎక్కడి వారు అక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నారు. " అని పురుషోత్తం వివరించారు.
"ఇలా సంచార వ్యాపారంతో రోజుకు రూ. 300 నుంచి 500 వరకు వ్యాపారం జరుగుతుంది. వర్షాకాలం మాత్రం కొంచెం ఇబ్బందికరం" అని పురుషోత్తం తమ బతుకుపోరాటాన్ని మాటల్లో వివరించారు.


ముగ్గు అనేది ఇంటి వాకిలి, ఇంటి లోపలా అందంగా అలంకరించే పాతకాలం నుంచి వస్తున్న మన సాంప్రదాయం. దీన్ని ఉత్తర భారతదేశంలో రంగోలి అని పిలుస్తారు.

ఇంటి ముందు పేడనీటితో కల్లాపి చల్లి, తడిగా ఉండగానే ఈ పిండితో ముగ్గులు వేస్త అందమే వేరుగా ఉంటుంది. అని అతను చెబుతున్నారు.

"ఈ ఆచారాన్ని మేము పాటిస్తాం. ఇప్పటికీ ముగ్గులు వేస్తున్నాం" అని మహారాష్ర్టలోని అమరావతి ప్రాంతానికి చెందిన ఈ మహిళలు తెలిపారు.
Tags:    

Similar News