జగన్‌ పాలెగాళ్ల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాడు

రాయలసీమను జగన్‌ సర్వనాశనం చేశారని మంత్రి పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు.;

Update: 2025-07-17 10:57 GMT

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమలో పాలగాళ్ల సంస్కృతిని మళ్లీ ప్రోత్సహిస్తున్నాడని మంత్రి పయ్యావుల కేశవ్‌ ధ్వజమెత్తారు. బనకచర్ల–పోలవరం ప్రాజెక్టుపైన జగన్‌ మాట్లాడుతున్న మాటలను చరిత్ర క్షమించదని మండిపడ్డారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మల్కాల పంపింగ్‌ స్టేషన్‌ వద్ద హంద్రీనీవా కాల్వకు కృష్ణా నీటిని సీఎం చంద్రబాబు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ.. జగన్‌ మీద, వైసీపీ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాయలసీమను అభివృద్ధి చేసింది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీనే అని అన్నారు. వైసీపీలోకి ఎంత మంది మారినా, జగన్‌ వైపు ఎంత చూసినా, తమ వైపు ఒకే నాయకుడు ఉన్నారని పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. ఏపీలో వైసీపీ నాయకులు రౌడీ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ మీద, జగన్‌ మీద విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన కేవలం 100 రోజుల్లోనే హంద్రీనీవా కాల్వ సామర్థ్యాన్ని 12 పంపులకు పెంచామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీసీ గంప మట్టి కూడా తీయలేదన్నారు. రాయలసీమ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, గత ప్రభుత్వం, మాజీ సీఎం జగన్‌ ఏపీలో, రాయలసీమలో అరాచకం సృష్టించారని ధ్వజమెత్తారు.

Tags:    

Similar News