ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మంత్రులే..అధికారులు కాదు

విశాఖ స్టీల్ ప్లాంట్ కు చాలా చేశాం. మూతపడకుండా కాపాడాం. నష్టాల నుంచి బయటకు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Update: 2025-10-10 10:28 GMT

ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మంత్రులేనని, అధికారులు కాదని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు.  మంత్రులు, సెక్రెటరీలకు సూచనలు ఇచ్చినప్పటికీ, శాఖలను నడిపించే బాధ్యత మంత్రులదే. పని చేయని అధికారులను మందలించాల్సింది కూడా మంత్రులే. ఎన్నికల్లో పోటీ చేసేది మంత్రలే, అధికారులు కాదు అని సీఎం చంద్రబాబు మంత్రులను హెచ్చరించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను మూతపడకుండా కాపాడినట్లు, నష్టాల నుంచి బయటకు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.  విశాఖపట్నంను ముంబై తరహాలో ఈస్ట్ కోస్ట్‌లో అభివృద్ధి కేంద్రంగా మార్చే లక్ష్యాన్ని వెల్లడించారు. రైల్వే జోన్, గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలార్ మిత్తల్ ప్లాంట్ వంటి కీలక ప్రాజెక్టులను విశాఖకు తీసుకొచ్చామని, ఈ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు.

కేబినెట్ సమావేశంలో కీలక ప్రకటనలు:

  • వైజాగ్ స్టీల్ ప్లాంట్: గతంలో నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడి, లాభాల బాటలో నడిపించామని సీఎం చంద్రబాబు తెలిపారు. మా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకోవడంతో దీనిని మూతపడకుండా కాపాడగలిగాం అని ధీమా వ్యక్తం చేశారు.
  • విశాఖ అభివృద్ధి: 2028 నాటికి విశాఖ దేశంలో ప్రత్యేక సిటీగా మారుతుందని, వెస్ట్‌లో ముంబైలా ఈస్ట్‌లో విశాఖ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్‌కు త్వరలో శంకుస్థాపన జరుగుతుందని ప్రకటించారు.
  • ఐటీ రంగం: ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించే లక్ష్యంతో గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు తీసుకొచ్చామని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రాలో 4.7 లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్‌లో పని చేస్తున్నారని, దీనిని 10 లక్షలకు పెంచే లక్ష్యమని అధికారులకు ఆదేశించినట్లు వెల్లడించారు.
  • పంచాయతీ రాజ్ సంస్కరణలు: పంచాయితీలను రేషనలైజేషన్ చేసి, రూరల్, అర్బన్ పంచాయతీలుగా విభజించి అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం ఆనందకరమని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. విశాఖ అభివృద్ధికి, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఈ ప్రాజెక్టులు ఊతం ఇస్తాయి అని పేర్కొన్నారు.

Tags:    

Similar News