గుంజీలు తీసిన హెడ్మాస్టర్‌ను మంత్రి లోకేష్ మెచ్చుకున్నారు
సహజంగా..చదవడం లేదని, మాట వినడం లేదని పిల్లలను టీచర్లు గుంజీ లు తీయిస్తారు. గోడ కుర్చీలు వేయిస్తారు. కానీ ఆ హెడ్మాస్టర్ వెరీటీగా తనకు తానే శిక్షించుకున్నారు.;
ఆంధ్రప్రదేశ్‌లో ఓ వింత నిరసన వ్యక్తం అయింది. సహజంగా తమ పిల్లలను ఉపాధ్యాయులు తిట్టారనో, కొట్టారనో, పాఠాలు సరిగా చెప్పడం లేదనో, టీచర్లు బడికి సరిగా రాలేదనో పిల్లల తల్లిదండ్రులు, స్థానికులు నిరసనలు తెలుపుతారు. కానీ అందుకు భిన్నంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడే నిరసనలు తెలిపారు. విద్యార్థులు మాట వినడం లేదని వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేశారు. పాఠశాలలోని పిల్లలందరి ముందు ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు గుంజీలు తీశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ హైస్కూలు ఈ వినూత్నమైన సంఘటన చోటు చేసుకుంది.
పాఠశాలలో, చదువులో ప్రోగ్రెస్ సరిగా లేదని, సరిగా చదవడం లేదని, దీనికి తోడు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినడం లేదని చెబుతూ ఆ పాఠశాల హెడ్మాస్టర్ చింత రమణ గుంజీలు తీసి నిరసన తెలిపారు. ఆ పాఠశాల పిల్లలందరినీ ఒక దగ్గరు చేర్చి వారు ముందే తనను తాను శిక్షించుకున్నారు. ఆ విద్యార్థుల ముందే గుంజీలు తీశారు. వినూత్న, వెరైటీ పద్ధతిలో నిరసనలు తెలిపిన ఆ వీడియో తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో బాగా వైరల్‌గా మారింది. అటు ఉపాధ్యాయ వర్గాల్లోను, ఇటు పిల్లల తల్లిదండ్రుల్లోను చర్చనీయాంశంగా మారింది.