మంత్రి జూపల్లి వెరీ డేరింగ్

మంత్రి జూపల్లి(Minister Jupally) ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండానే బుధవారం రాత్రి టన్నెల్లోని 13.8వ కిలోమీటర్ దాకా వెళ్ళారు;

Update: 2025-02-27 09:40 GMT

తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డేరింగ్ స్టెప్ కు అందరు ఫిదా అయిపోతున్నారు. ఐదురోజులుగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో(SLBC Accident) చిక్కుకుపోయిన ఎనిమిదిమందిని రక్షించేందుకు ప్రభుత్వ శతవిధాలుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. తెలుగురాష్ట్రాల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా రేవంత్(Revanth) ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ చేస్తోంది. ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ఎఫ్, మిలిట్రీ, నేవీ, మార్కోస్, సింగరేణి రెస్య్కూ బృందాలు, ర్యాట్ హోల్ మైనర్స్, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, హైడ్రా, జీఎస్ఐ కాకుండా ఎల్ అండ్ టీ, నవయుగ కంపెనీల్లోని నిపుణులు అంతా టన్నెల్ దగ్గరే ఉన్నారు. బాధితులను రక్షించటమే టార్గెట్ గా ఐదురోజులుగా అందరు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.

ఇంతమంది ఉండికూడా టన్నెల్లో 14 కిలోమీటర్ దగ్గరకు ఎలాగ వెళ్ళాలనే అంశంపై మల్లగుల్లాలుపడుతున్నారు. 14 కిలోమీటర్ల టన్నెల్లో ప్రమాదం జరిగింది 12-14 కిలోమీటర్ల మధ్యనే. టన్నెల్లో చిక్కుకుపోయిన 8మంది 13-14 కిలోమీటర్ల మధ్యలోనే ఎక్కడో ఉండుంటారని నిపుణులు అంచన వేస్తున్నారు. నాలుగురోజులుగా రాత్రి, పగలు తేడా లేకుండా నిపుణుల బృందాలు నానా అవస్తలు పడుతుంటే నాలుగోరోజు రాత్రికి కొందరు 13 కిలోమీటర్ దాటి వెళ్ళగలిగారు. ఎందుకంటే 12 కిలోమీటర్లు వెళ్ళగలుగుతున్న బృందాలు అంతకుమించి ముందుకు వెళ్ళటానికి చాలా కష్టపడుతున్నాయి. కారణం ఏమిటంటే టన్నెలోపల ఆక్సిజన్ సరిగా అందకపోవటం, ఇంకా టన్నెల్ పై కప్పునుండి నీరు ఊరుతుండటం, టన్నులకొద్ది బురద, మట్టి 15 అడుగుల ఎత్తులో పేరుకుపోవటం లాంటి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. నిపుణుల్లో కొంతమంది మాత్రమే రక్షణచర్యలు తీసుకుని 13వ కిలోమీటర్ ను దాటి వెళ్ళగలిగారు.

ఇలాంటి పరిస్ధితుల్లో మంత్రి జూపల్లి(Minister Jupally) ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండానే బుధవారం రాత్రి టన్నెల్లోని 13.8వ కిలోమీటర్ దాకా వెళ్ళారు. గన్ మెన్ వెంటరాగా రెస్క్యూ బృందాల దగ్గరకు జూపల్లి వెళ్ళారు. టన్నెల్లోపల జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ను దగ్గరుండి గమనించారు. 13.8 నుండి 14 కిలోమీటర్ల మధ్య ప్రాంతంగురించి అడిగి తెలుసుకున్నారు. దాదాపు అర్ధగంట జూపల్లి టన్నెల్లోపలే గడిపారు. ఇదేవిషయాన్ని నీటిపారుదలరంగ నిపుణుడు ప్రకాష్ వివరించారు. జూపల్లికి హ్యాట్సాఫ్ చెప్పారు. టన్నెల్లోపలికి వెళ్ళటానికి జూపల్లి చాలా సాహసం చేసినట్లు చెప్పారు. ఎలాంటి రక్షణ ఏర్పాట్లులేకుండానే మంత్రి టన్నెల్లోపల 13.8వ కిలోమీటర్ వరకు వెళ్ళటం పెద్ద సాహసంగా ప్రకాష్ అభివర్ణించారు.

Tags:    

Similar News