కూటమి వచ్చిన తర్వాత సముద్రం పాలైన నీరు ఎంతంటే..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో నదుల నుంచి భారీ స్థాయిలో వరద నీళ్లు సముద్రంలో కలిసిపోయాయి.

Update: 2025-10-01 03:30 GMT

2024 జూన్‌లో టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నదుల నుంచి భారీ స్థాయిలో వరద నీళ్లు సముద్రంపాలయ్యాయి. సుమారు 6,000 టీఎంసీ (థౌసెండ్‌ మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్‌) వరద నీళ్లు సముద్రంలో వృధాగా కలిసిపోయాయి. ఈ కాలంలో (జూన్‌ 2024 నుంచి సెప్టెంబర్‌ 30, 2025 వరకు) రెండు మాన్సూన్‌ కాలాల్లో ఎగువ ప్రాంతాల్లో కురుçస్తున్న భారీ వర్షాలు, వరదలు ఏపీని తాకడంతో ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం బ్యారేజీల నుంచి భారీగా వరద నీళ్లు విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ నీళ్లను సమర్థవంతంగా ఉపయోగించాలని, రివర్‌ లింకింగ్‌ ప్రాజెక్టుల ద్వారా వ్యర్థాలను తగ్గించాలని ఆకాంక్షిస్తోంది. అంతకుముందు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా సముద్రంలో కలిసిపోయి వృధా అవుతున్న వరద నీటిని ఉపయోగించుకోవాలని, దీని కోసం ఆనకట్టలు కూడా నిర్మించాలని భావించింది. కానీ కార్యరూపం దాల్చలేదు.

కృష్ణా నది: 1,500 టీఎంసీల వరద నీళ్లు సముద్రంలో
కృష్ణా నదిలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా 2024–25 సీజన్‌లో మొత్తం 848.96 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిపాయి. 2024 సెప్టెంబర్‌లో విజయవాడ వరదల సమయంలో బ్యారేజీ నుంచి 11.06 లక్ష క్యూసెక్కుల వరద నీళ్లు సముద్రంలోకి విడుదల చేశారు, ఇది 70 సంవత్సరాల చరిత్రలో రికార్డు. పీక్‌ డిస్చార్జ్‌ 11.43 లక్ష క్యూసెక్కులకు చేరింది, మొత్తం వాల్యూమ్‌ సుమారు 800 టీఎంసీలు. 2025 మాన్సూన్‌లో కూడా జూలై నుంచి 612 టీఎంసీలు సముద్రంలో కలిపాయి. ఈ వరదలు విజయవాడ, కృష్ణా జిల్లాల్లో విçస్తృత నష్టాలు కలిగించాయి, కానీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే ఈ వరద నీటిని చాలా వరకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
గోదావరి నది: 3,782 టీఎంసీలు వ్యర్థమయ్యాయి
గోదావరి నది ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 2024–25 కాలంలో సుమారు 3,782 టీఎంసీల వరద నీళ్లు సముద్రంలో కలిపాయి, ఇందులో కృష్ణాతో కలిపి మొత్తం 3,782 టీఎంసీలు. 2024 సెప్టెంబర్‌ వర్షాల సమయంలో 14 లక్ష క్యూసెక్కులు విడుదల చేశారు. వార్షికంగా సగటున 2,850–3,000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి, 2015–2024 మధ్య 28,500 టీఎంసీలు వ్యర్థమయ్యాయి. 2025లో కూడా కేవలం ఆగస్టు–సెప్టెంబర్‌లో 1,000 టీఎంసీలు కలిసినట్లు అంచనా.
పెన్నా నది: 200–300 టీఎంసీల వరదలు
పెన్నా నది నుంచి కూడా 2024–25లో సుమారు 200–300 టీఎంసీల వరద నీళ్లు సముద్రంలో కలిపాయి.
ఇతర నదులు: 500 టీఎంసీలు
వంశధార వంటి ఇతర చిన్న నదుల నుంచి 500 టీఎంసీల వరదలు సముద్రంలో కలిపాయి.
కూటమి ప్రభుత్వం ’వన్‌ స్టేట్‌–వన్‌ వాటర్‌’ కాన్సెప్ట్‌తో ఈ నీళ్లను డ్రిప్‌ ఇరిగేషన్, ఇంటర్‌ లింకింగ్‌ ద్వారా ఉపయోగించాలని ప్రణాళికలు రచిస్తోంది. 2025 మే మీటింగ్‌లో కేంద్ర మంత్రులతో చర్చించినట్లు సమాచారం. అయితే ఇలా ప్రతి ఏటా సముద్రంలో వృధాగా కలిసిపోయి వృధా అవుతున్న వరద నీటిని ఎప్పుడు వినియోగంలోకి తెస్తారనేది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.
Tags:    

Similar News