ఢీ కొట్టుకున్న రెండు లారీలు–ఇద్దరు వ్యక్తులు స్పాట్ డెడ్
ఏలూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు.;
By : The Federal
Update: 2025-08-17 06:02 GMT
ఏలూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు ఢీకొట్టుకోవడంతో ఘోరం ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం వద్ద చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కొబ్బరికాయల లోడుతో పాలకొల్లు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీ కొట్టింది. మితిమీరిన వేగంతో ఢీకొట్టడంతో కొబ్బరికాయల లోడు లారీ డ్రైవర్ రాజేష్, క్లీనర్ లక్ష్మణ్‌లు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయి స్పాట్‌లోనే మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.