కేబినెట్‌లో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్‌గా లోకేష్
మెగా డీఎస్సీ బాగా నిర్వహించారంటూ మంత్రి నారా లోకేష్‌ను మంత్రి వర్గ సమావేశంలో మంత్రులు అభినందించారు.;
కేబినెట్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్‌గా నిలిచారు. మంత్రులు అందరూ నారా లోకేష్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. మెగా డీఎస్సీ సమర్థంగా నిర్వహించారంటూ మంత్రులందరూ లోకేష్‌కు అభినందనలు తెలిపారు. మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు కోర్టుల్లో 72 కేసులు వేసినా ప్రతి సమస్యను ఒక సవాల్‌గా స్వీకరించారని, వాటిని అన్నింటిని ధీటుగా ఎదుర్కొంటూనే వెనకడుగు వేయకుండా అనుకున్న ప్రకారం మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించారని మంత్రులు అందరూ లోకేష్ మీద ప్రశంసల జల్లు కురిపించారు. ఇదే సందర్భంలో పోలీసు శాఖలో పని చేస్తున్న చాలా మంది కానిస్టేబుళ్లు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారనే దానిపైన మంత్రుల మధ్య చర్చకు వచ్చింది. దాదాపు 400 మంది పోలీసులు మెగా డీఎస్సీకి ఎంపికై ఉంటారని మంత్రులు అంచనాకు వచ్చారు. అయితే పోలీసులు ఇలా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న నేపథ్యంలో ఏర్పడే ఖాళీలను త్వరగా భర్తీ చేయాలనే అంశంపైన కూడా చర్చించారు. ఈ క్రమంలో ఉత్పన్నమయ్యే న్యాయపరమైన సమస్యలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొని, వాటిని పరిష్కరించుకుంటూనే పోలీసు పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలని మంత్రి లోకేష్ ప్రస్తావించినట్లు సమాచారం.