లిక్కర్‌ స్కామ్‌లో మరో మాజీ ఐఏఎస్‌ రజత్‌ భార్గవ్ కి నోటీసు

మాజీ ఐఏఎస్‌ రజత్‌ భార్గవ్ ను అరెస్టు చేసి జైలుకు పంపుతారా? విచారణ చేసి వదిలేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.;

Update: 2025-07-11 10:02 GMT
రజత్‌ భార్గవ్

ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కేసులో మరో మాజీ ఐఏఎస్‌ అధికారి రజత్‌ భార్గవ్ పేరు తెరపైకొచ్చింది. ప్రస్తుతం ఆయనను సిట్‌ అధికారులు విజయవాడలో విచారిస్తున్నారు. పోలీసులు ఇది వరకే ఆయనకు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం 10 గంటలకు విజయవాడ సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తనకు ఆరోగ్యం సరిగా లేదని, అనారోగ్య కారణాల రీత్యా విచారణకు హాజరు కాలేనని సిట్‌ అధికారులు జారీ చేసిన నోటీసులకు బదులిచ్చారు. రజత్‌ భార్గవ్ ఇచ్చిన వివరణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన సిట్‌ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరు కావలసిందే అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కాస్త ఆలస్యంగా విచారణ కోసం విజయవాడ సిట్‌ కార్యాలయానికి రజత్‌ భార్గవరజత్‌ భార్గవ్ చేరుకున్నారు.

ప్రస్తుతం విశ్రాంత ఐఏఎస్‌ అధికారిగా ఉన్న రజత్‌ భార్గవ గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన పని చేశారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో రూపొందించిన మద్యం పాలసీలో కూడా ఈయన పాత్ర ఉందని సిట్‌ అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సయమంలో నాడు విడుదలైన ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు, మద్యంకు సంబంధించిన లావాదేవీలు వంటి పలు అంశాలపై రజత్‌ భార్గవను సిట్‌ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రజత్‌ భార్గవ్‌ను కూడా ఈ కేసులో అరెస్టు చేసి జైలుకు తరలిస్తారా? లేదా కేవలం విచారణ చేపట్టి వదిలేస్తారా? అనేది దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ అధికారులు ధనుంజరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్టు చేశారు. ప్రస్తుతం వీళ్లు విజయవాడ జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు.
Tags:    

Similar News