వైజాగ్‌లో పెట్రోలియం ట్యాంకర్‌పై పిడుగు
పిడుగుపాటు వర్షాలు విశాఖపట్నం ప్రజలను ఒక్క సారిగా కలవరానికి గురి చేశాయి.;
By : The Federal
Update: 2025-09-07 11:26 GMT
విశాఖపట్నంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం పెట్రోలియం ట్యాంకర్‌పైన పిడుగు పడటంతో భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో విశాఖ నగరం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. భారీగా ప్రాణ నష్టం జరుగుతుందేమో అని నగర ప్రజలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చెందారు. అలాంటిదేమీ జరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
అసలు ఏమి జరిగిందంటే..
విశాఖపట్నంలో ప్రస్తుతం భారీగా వర్షాలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగుపాటు వర్షాలు విశాఖ ప్రజలను ఒక్క సారిగా కలవరానికి గురి చేశాయి. ఎవరూ ఊహించని విధంగా విశాఖపట్నంలోని ఈస్టిండియా పెట్రోలియం కార్పోరేషన్‌లోని పెట్రోల్ ట్యాంకర్‌పై పిడుగు పడింది. దీంతో ఒక్క సారిగా భారీ మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మరో వైపు ఎలాంటి ప్రాణ నష్టం జరక్కపోడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.