కార్పొరేట్ల కోసమే 'కగార్'

హిడ్మా మృతిపై విచారణకు వామపక్ష, ప్రజాసంఘాల డిమాండ్.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-22 11:13 GMT
రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శవర్గ సభ్యుడు ఏ. రామానాయుడు

ధనవంతులకు అడవులు అప్పగించడానికి ప్రజాస్వామ్య వాదులను అంతమోందించడానికే కేంద్రప్రభుత్వం ఆపరషన్ కగార్ చేపట్టిందని వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ఆరోపించాయి. అమాయక ఆదివాసీలపై హత్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరిట నక్సల్స్‌ను పట్టుకున్న తర్వాత భూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో చంపేస్తోందని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి.

తిరుపతిలోని సీపీఐ కార్యాలయం గంధమనేని శివయ్య భవనంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పి.మురళి అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర హక్కుల సంఘం నేత క్రాంతి చైతన్య మాట్లాడుతూ, పీఎల్జీఏ కమాండర్, మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్ పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆయన ఏమన్నారంటే..

"మావోయిస్టు నేత హిడ్మాను భూటకపు ఎన్‌కౌంటర్ ద్వారా హతమార్చారు. ఆ ఘటనపై నిష్పాక్షిక విచారణ తప్పనిసరిగా జరగాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆర్ఎస్ఎస్ భావజాల మోడీ ప్రభుత్వమే సహజ వనరుల దోపిడీకి కార్పొరేట్ శక్తులకు మార్గం సుగమం చేస్తూ మావోయిస్టులను అంతమొందిస్తోంది" అని ఆరోపించారు. 50 ఏళ్లుగా ఎన్‌కౌంటర్లను హత్య నేరంగా పరిగణించాలని మా పోరాటం కొనసాగుతోంది. ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడం ద్వారానే హక్కులను కాపాడుకోవచ్చని తెలిపారు.
కార్పొరేట్ల కోసమే..
అటవీ ప్రాంతాల్లోని విలువైన ఖనిజాలను కార్పొరేట్లకు అప్పగించేందుకు మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ పేరిట దాడులు చేస్తున్నారని సిపిఐ రాష్ర్ట కార్యవర్గ సభ్యలు ఎ.రామానాయుడు ఆరోపించారు.
"గిరిజనుల భూములు, అరణ్యాలు రక్షించాలనే ప్రయత్నం చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని భయపెట్టి తరిమేస్తున్నారు" అని రామానాయుడు ఆగ్రహించారు. మావోయిస్టులను తుదముట్టించినా వారి సిద్ధాంతాన్ని చంపలేరని ఆయన హెచ్చరించారు. ఆదివాసీల సమస్యల పరిష్కారంలో, నిరుద్యోగ సమస్యను తీరుస్తడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు.

సీనియర్ జర్నలిస్టు రాఘవ శర్మ మాట్లాడుతూ, ఆదివాసులకు రక్షణ లేకపోవడమే నక్సలిజం మూలం అని అన్నారు.
ఆదివాసీలు అడవులకు నిజమైన రక్షకులని, వారిని నిర్లక్ష్యం చేయడం వల్లే నక్సలిజం ఉద్భవించిందని విశ్లేషించారు.
మావోయిస్టుల వద్ద బంగారం, కోట్ల రూపాయలు దొరికాయనే ప్రచారం అపోహ మాత్రమే. ఎన్నికల ఖర్చులు కోట్లు దాటుతున్న నేపథ్యంలో ఆర్థిక అసమానత పెరిగిపోతుంది. ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడే బాధ్యత వహించాలని అని సీనియర్ జర్నలిస్టు రాఘవ హెచ్చరించారు.
ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఎన్‌కౌంటర్ అంటే రాజ్యాంగంపై దాడగా భావించాన్నారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్‌కౌంటర్లన్నీ రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడులు మినహా మరొకటి కాదన్నారు. ఇప్పటివరకూ 500 మందికి పైగానే ఆదివాసులు ఎన్‌కౌంటర్ల పేరిట ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర సంస్థలు ప్రధాని నమేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కనుసన్నల్లో నడుచుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భూటకపు ఎదురుకాల్పులపై వెంటనే సమగ్ర విచారణ జరపాలని నాగరాజు డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి షాపై కేసు పెట్టాలి..
2026 మార్చి చివర్లో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కేసు నమోదు చేయాలని ఆర్‌పిఐ అధ్యక్షులు అంజయ్య డిమాండ్ చేశారు. మావోయిస్టులను అంతం చేయడం ద్వారా కాషాయ పతాకం ఎగరేయాలనే అజెండాతో కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అంజయ్య వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మావోయిస్టులను అంతం చేయడాన్ని ప్రధాన లక్ష్యంగా మార్చుకుందని అన్నారు. ఎర్రజెండా కనబడకుండా చేస్తూ, కాషాయ జెండా దేశం నిండా ఎగరేయడం ప్రధాని నరేంద్రమోదీ అజెండాగా ఎంచుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో సిపిఐ ఎమ్‌ఎల్ నగర కార్యదర్శి వెంకటరత్నం మాట్లాడుతూ, ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లుగా ముద్రవేయడం సహించరానిది అన్నారు. బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ, ప్రశ్నించే వామపక్ష నేతలను అర్బన్ నక్సలైట్లు అంటూ కేసులు పెడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం దేశ సంపదను దోచిపెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వామపక్ష ఉద్యమం బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం లో మాజీ మావోయిస్టు నేత చంద్ర శేఖర్ రెడ్డి, సుశీ పార్టీ నేత హరీష్, సిపిఐ నాయకులు విశ్వనాథ్, రామచంద్రయ్య, నాగరాజ్, డాక్టర్ జనార్దన్, రాధాకృష్ణ, చంద్ర శేఖర్ రెడ్డి, ఎ ఐ ఎస్ ఎఫ్ నేత సాయి, సిపిఐ ఎం ఎల్ నేత వెంకయ్య, బి ఎన్ పి నేత శశికుమార్ వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Tags:    

Similar News