ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాలకు రెడీ అయిన నేతలు

గెలుస్తామనే ధీమా ఇరు పార్టీల్లోనూ ఉంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే విశాఖలో ప్రమాణ స్వీకారోత్సవానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేయిస్తున్నారు.

Update: 2024-06-01 04:10 GMT

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదంటున్నారు నేతలు. ఎవరికి వారు గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒకడుగు ముందుకు వేసి విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వేళ గెలవకపోతే పరిస్థితి ఏమిటనేది అందరి మనస్సుల్లోనూ ఉన్న ప్రశ్న. ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు ఎలాగూ జరిగాయి కాబట్టి దీనిని పార్టీ నిర్మాణ వేదికగా మార్చి తొమ్మిదో తేదీన వైఎస్సార్‌సీపీ బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీలోనే చర్చ సాగుతోంది.

చంద్రబాబు నాయుడు కూడా తామే ప్రమాణ స్వీకారం చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. పార్టీ తరపున పలువురు నాయకులు ప్రకటించడం విశేషం. టీడీపీ వైపు నుంచి కూడా అమరావతిలో ప్రాంతంలో ఈనెల 9న ప్రమాణ స్వీకారం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే వైఎస్సార్‌సీపీ మాదిరి గ్రౌండ్‌లో మైకులు కట్టించే ఏర్పాట్లు మాత్రం ఇంకా చేయలేదు.
ఎందుకు ఈ హడావుడి
గెలుపు ఓటములు సహజం. ఒకరు గెలుస్తారు. మరొకరు ఓడిపోతారు. ఎవరు గెలుస్తారనేది నాలుగో తేదీన తేలిపోతుంది. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టి గెలుపు ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన తరువాత ప్రమాణ స్వీకారానికి తగిన ఏర్పాట్లు చేసుకోవచ్చు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోడానికి వారు అనుకున్న తేదీ ప్రకారం చూస్తే మరో నాలుగు రోజులు సమయం ఉంది. ఏర్పాట్లు కేవలం రెండు రోజుల్లోనే చేయొచ్చు. కానీ వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీలు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఇటువంటి పరిస్థితులు ఇంతకు ముందెన్నడూ జరగలేదు.
విదేశాల నుంచి ఇళ్లకు చేరుకున్న నేతలు
Delete Edit
ఎన్నికల ప్రచారంలో బాగా తిరిగిన నేతలు ఎన్నికలు పూర్తవగానే చంద్రబాబునాయుడు కొన్ని దేవాలయాలకు వెళ్లి వచ్చారు. ఆ తరువాత భార్యతో కలిసి గత నెల 19న అమెరికా వెళ్లారు. అక్కడ పది రోజుల పాటు ఉండి మే నెల 29న తిరిగి వచ్చారు. లోకేష్‌ గత నెల 16న అమెరికా వెళ్లారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత నెల 17న ఇంగ్లండ్‌ వెళ్లారు. లండన్‌లో ఏపీ నుంచి వెళ్లిన పలువురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాట కచేరి ఏర్పాటు చేశారు. కార్‌ ర్యాలీ నిర్వహించారు. జగన్‌ తిరుగులేని నాయకుడని పొగడ్తలతో ముంచెత్తారు. మరో రెండు దేశాల్లో కూడా జగన్‌ భార్యతో కలిసి పర్యటించి 17 రోజుల పాటు ఉన్నారు. జూన్‌ 1న తిరిగి తాడేపల్లికి తెల్లవారు ఝామున 4.30 గంటలకు చేరుకున్నారు.
మిగిలిన పార్టీల నాయకులు గెలుపు ఓటముల లెక్కల్లో మునిగి తేలుతున్నారు. ఈనెల 4న కౌంటింగ్‌ ఉండటంతో ఆయా పార్టీల నేతలంతా ఏపికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. కొందరు హైదరాబాద్‌లో ఉన్నారు.
Tags:    

Similar News