కళ్లల్లో కారం కొట్టి బంగారం లాక్కెళ్లిన మాయ లేడీ

రంగంలోకి దిగిన పోలీసులు మహిళా దొంగ కోసం గాలింపులు చేపట్టారు.;

Update: 2025-08-20 07:48 GMT

విశాఖపట్నంలో ఓ లేడీ దొంద జూలు విదిల్చింది. దొంగతనాలకు అలవాటుపడిని ఆ మాయ లేడీ తన చేతి వాటానికి పని చెప్పింది. చోరీలు చేసేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుంది. కళ్లల్లో కారం కొట్టి చోరీ చేసేందుకు పథకం రూపొందించింది. అనుకున్నదే తడువుగా దానిని అమలుకు పదును పెట్టింది. ఇంటి ఆవరణలో కూర్చొని ఉన్న మహిళలనే టార్గెట్‌గా చేసుకుంది. విశాఖపట్నం నగరం లాసెన్స్‌బే కాలనీలో ఆరుబయట కూర్చొని ఉన్న మహిళ కంటో కారం కొట్టి.. ఆమె చేతికి ఉన్న బంగారు గాజులను లాక్కెళ్లిపోయింది. బాధితురాలు, స్థానికులు ఆ మాయలేడీని పట్టుకుందామని అలెర్ట్‌ అయ్యేలోపల క్షణాల్లో మాయమైంది. స్థానికులకు చిక్కకుండా అక్కడ నుంచి పరారైంది.

ఇక చేసేదేమీలేక పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు మహిళా దొంగపై కేసు నమోదు చేశారు. అయితే ఇది వరకే ఈ మాయ లేడీ పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందనే విషయం పోలీసులు తెలిపారు. దీంతో ఎలాగైన ఆ లేడీ దొంగాటలకు ఫుల్‌స్టాప్‌ పెట్టించాలనే లక్ష్యంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను పట్టుకునేందుకు వేట మొదలు పెట్టారు. మరో వైపు ఈ మాయ లేడీ దొంగతనాలపై విశాఖపట్నం నగరం ఒక్క సారిగా అలెర్ట్‌ అయ్యింది. మహిళలు ఇలాంటి నేరాలకు పాల్పడుతుండటంతో ఆందోళనలకు గురవుతున్నారు.

Tags:    

Similar News