కర్నూలు బస్సు ప్రమాదం: కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు, హెల్ప్‌లైన్ నంబర్లు

శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదంలో 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Update: 2025-10-24 04:01 GMT

కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్ద జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో స్లీపర్ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ఇంధన ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి, ఫలితంగా బస్సు పూర్తిగా దగ్ధమైంది. 

ఈ విషాదకర ఘటనను దృష్టిలో ఉంచుకుని, బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు కర్నూలు జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశాల మేరకు సహాయక చర్యలు వేగవంతం చేయడానికి కింది హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి:

కంట్రోల్ రూమ్..హెల్ప్‌లైన్ నంబర్లు:

  • కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 08518-277305
  • కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కంట్రోల్ రూమ్: 9121101059
  • ఘటనాస్థలి వద్ద కంట్రోల్ రూమ్: 9121101061
  • కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్: 9121101075
  • కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు:
    • 9494609814
    • 9052951010

హెల్ప్‌లైన్ సేవలు: బాధిత కుటుంబాలు, ప్రయాణికుల బంధువులు పైన పేర్కొన్న నంబర్లకు సంప్రదించి మృతుల గుర్తింపు, క్షతగాత్రుల వివరాలు, చికిత్స సమాచారం, ఇతర సహాయం పొందవచ్చు.

Tags:    

Similar News