ఓటీటీలోకి శేఖర్ కమ్ముల 'కుబేరా'

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కుబేరా సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది.;

Update: 2025-07-11 12:08 GMT
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కుబేరా సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది. ఈ సినిమాలో ప్రముఖ నటులు ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక నటించారు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల నిర్మించారు. ‘కుబేర’ చిత్రానికి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. సినీప్రియుల్ని అలరించింది. గత నెలలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా (Amazon Prime Video) జులై 18 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఓటీటీ స్ట్రీమింగ్ పై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెర దించుతూ చిత్ర నిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అమెజాన్‌ ప్రైమ్ కూడా ఓ పోస్టర్ను‌ విడుదల చేసింది.
దేశంలోనే అత్యంత సంపన్నుడైన గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సీఈవో నీరజ్‌ మిత్ర (జిమ్‌ సర్బ్‌) ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలవాలని కలలు కంటుంటాడు. ఆ కల కోసం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌ను వినియోగించుకోవాలనుకుంటాడు. రూ.లక్ష కోట్ల డీల్‌ కుదుర్చుకుంటాడు. ఆ మొత్తం డబ్బులో రూ.50 వేల కోట్లు బ్లాక్‌లో.. మిగిలిన డబ్బు వైట్‌లో ఇవ్వాలని నీరజ్‌కు సిద్ధప్ప షరతు విధిస్తాడు. ఈ పనిని సమర్థంగా చేయడం కోసం జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్‌ తేజ్‌ (నాగార్జున)ను బయటకు తీసుకొస్తాడు. ఈ పని కోసం దీపక్‌ బిచ్చగాళ్లను ఎంచుకుంటాడు. ఈ పని పూర్తి కాగానే ఆ నలుగురు బిచ్చగాళ్లను చంపేయాలని నీరజ్‌ ప్లాన్‌ చేయగా.. వారిలో ఒకడైన దేవా (ధనుష్‌) తప్పించుకుంటాడు. మరి వీళ్ల చేతికి దేవా దొరికాడా? తన ఖాతాలో ఉన్న వేల కోట్ల డబ్బును దేవా ఏం చేశాడు? అన్నది మిగిలిన కథ.
ఈ కథను చాలా సున్నితంగా, హృద్యంగా తీశారంటూ పలువురు నటులు, సినీ విశ్లేషకులు దర్శకుడు శేఖర్ కమ్ములను ప్రశంసించారు. ధనుష్ కూడా ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారని మెచ్చుకున్నారు. కొన్ని రోజుల పాటు డస్ట్ బిన్ల మధ్యనే ఈ చిత్రాన్ని నిర్మించినట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమాను తప్పకుండా చూడాలంటూ పలువురు రాజకీయ నాయకులు కూడా వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News