పోటెత్తిన కృష్ణమ్మ
శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ కు నీటిని వదిలారు. పరవళ్తు తొక్కుతూ పయనిస్తోంది.
Byline : G.P Venkateswarlu
Update: 2025-09-23 07:53 GMT
కర్నాకట ప్రాంతంలో భారీ వరదల కారణంగా కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. మంగళవారం నది ఉధృతి పెరిగింది. శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,42,516 క్యూసెక్కులు చేరుతుండగా 4,06,227 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,072 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు పది స్పిల్ వే గేట్లను 12 అడుగులు ఎత్తి 3,10,840 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.35 టీఎంసీలుగా కొనసాగుతోంది.