సచిన్‌ తర్వాత కోహ్లీదే రికార్డు

రికార్డులను సృష్టించడంలో విరాట్‌ కోహ్లీ దూసుకుని పోతున్నాడు.;

By :  Admin
Update: 2025-03-09 12:54 GMT

ఇండియన్‌ క్రికెట్‌ చరిత్రలో భారత స్టార్‌ బ్యాట్సమెన్‌ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజీలాండ్‌తో భారత్‌ తలపతున్న నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ ఈ రికార్డు మైలురాయిని అందుకున్నాడు. వరుసగా మూడో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోపీ ఆడుతున్న కోహ్లీ అత్యధిక ఇంటర్‌నేషనల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడిన ఇండియన్‌ ప్లేయర్స్‌ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. 550 అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడిన రెండో భారత్‌ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కోహ్లీ కంటే ముందు సచిన్‌ టెండూల్కర్‌ ఈ రికార్డును నెలకొల్పాడు. 664 అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడిన మొదటి భారతీయ ఆటగాడిగా సచిన్‌ టెండూల్కర్‌ తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 550 మ్యాచ్‌లతో రెండో ఇండియన్‌ క్రికెటర్‌గా కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లీ కంటే సచిన్‌ 14 అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు ఎక్కువ ఆడాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు రోల్‌ మోడల్‌గా నిలిచిన సచిన్‌ టెండూల్కర్‌ తన కెరీర్‌లో 200 టెస్టు మ్యాచ్‌లు, 463 వన్డే మ్యాచ్‌లు, ఒక టీ20 సిరీస్‌ ఆడాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు సచిన్‌ టెండూల్కర్‌ వీడ్కోలు పలికాడు. విరాట్‌ కోహ్లీ కూడా తానేమీ తక్కువ కాదంటూ ఇప్పటి వరకు 123 టెస్టు మ్యాచ్‌లు, 302 వన్డేలు, 125 టీ20 మ్యాచ్‌లు ఆడారు. ఛాంపియన్స్‌ ట్రోఫీ సిరీస్‌లో అద్బుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ తుది పోరుకు ముందుకు జరిగిన నాలుగు మ్యాచ్‌లో కూడా తన బ్యాట్‌కు పని చెప్పాడు. ఒక సెంచరీతో పాటు 217 పరుగులు సాధించాడు. మొత్తం 302 వన్డే మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 58.11 సగటు రన్‌రేటుతో 14,180 పరుగులు సాధించాడు. వీటిల్లో 51 సెంచరీలు కూడా బాదాడు.
Tags:    

Similar News