ఏపీ లిక్కర్ స్కాంలో రాజ్ కసిరెడ్డి అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణం కేసు కొత్త మలుపు తిరిగింది. 4,350 కోట్ల రూపాయల కుంభకోణంగా భావిస్తున్న దీనిపై సిట్ విచారణ ముమ్మరం చేసింది.;

Update: 2025-04-21 14:33 GMT
Raj kasireddy
ఏపీ మద్యం కుంభకోణం కేసు కొత్త మలుపు తిరిగింది. 4,350 కోట్ల రూపాయల కుంభకోణంగా భావిస్తున్న దీనిపై సిట్ విచారణ ముమ్మరం చేసింది. ఇందులో సూత్రధారిగా భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. సిట్ విచారణకు హాజరవువుతానని ప్రకటించిన 24 గంటల్లోపే కసిరెడ్డినిసిట్ అధికారులు హైదరాబాద్ లో అదుపులోకి విజయవాడకు తరలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. గత కొద్దిరోజుల నుంచి సిట్ బృందాలు రాజ్ కసిరెడ్డి కోసం వెతుకుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు పక్కా సమాచారంతో సోమవారం ఆయన్ని అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టులో కాపు కాసి మరీ సిట్ అధికారులు ఆయన్ని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్నారు.
మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరుకావాలంటూ ఏపీ హైకోర్టు ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన సిట్ అధికారులనుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన కోసం సిట్ బృందాలు గాలింపు చేపట్టాయి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్‌తో పాటు గచ్చిబౌలి, ఫైనాన్స్ డిస్ట్రిక్‌లో గాలించాయి. ఈ క్రమంలో అతడి నివాసానికి నోటీసులు అంటించాయి. అతడి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న రాయదుర్గంలోని ఆరేట ఆసుపత్రితోపాటు రాజ్ కసిరెడ్డికి చెందిన ఈడీ క్రియేషన్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించాయి.
కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరు?
కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి బంధువు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఐటీ సలహాదారుగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన భారీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించబడ్డారు. ఈ కుంభకోణం ద్వారా సుమారు ₹4,000 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మద్యం కుంభకోణంలో పాత్ర
కాసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏడుస్థాయిల అవినీతి వ్యవస్థను అమలు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) గుర్తించింది. మద్యం సరఫరా ఒప్పందాల కోసం కంపెనీల నుంచి లంచాలు తీసుకుని, ఆ డబ్బును మధ్యవర్తుల ద్వారా రాజకీయ నాయకుల వద్దకు చేరేలా చేశారు.
ఈ నిధులలో కొంత భాగాన్ని ED క్రియేషన్స్ అనే సినిమా సంస్థలో, అలాగే హైదరాబాద్, తెలంగాణాలో రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Tags:    

Similar News