ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన ఏపీ కేబినెట్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం కేబినెట్ సమావేశం జరిగింది.;
By : The Federal
Update: 2025-05-08 13:36 GMT
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఇ–క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్నారు. ఉగ్రవాదానికి వ్యవతిరేఖంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ సింధూర్‌కు మంత్రి మండలి సంఘీబావాన్ని వ్యక్తం చేసింది. ఈ ఆపరేషన్‌లో ఆర్మీ చూపుతున్న శక్తి యుక్తులకు మంత్రి మండలి అభినందలు తెలిపింది.
1.సాధారణ పరిపాలన శాఖ (రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ)
ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్ర రాజధాని పేరును ‘అమరావతి‘ గా నిర్ణయిస్తూ గతంలోని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 సెక్షన్ – 5 యొక్క సబ్ సెక్షన్ (2) సెక్షన్ –5కు వివరణలో చట్ట సవరణ కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
2. పురపాల, పట్టణాభివృది శాఖ
అమృత్ – 2.0 కింద రాష్ట్ర జల కార్యాచరణ ప్రణాళిక మొదటి – రెండవ విడతలో గతంలో చేసిన సవరణల అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని పురపాలక సంస్థల్లో 281 పనులను ఎస్‌ఎన్‌ఏ–ఎస్‌పీఏఆర్‌ఎస్‌హెచ్ ప్లాట్‌ఫాం ద్వారా కన్సెషనరీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (సీహెచ్‌ఏఎం) కింద చేపట్టడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పనులకు సంబందించి ప్రతిపాదించిన 12 రకాల నిబంధనలకు కూడా ఆమోదం తెలిపింది.
3. జలవనరుల శాఖ
ఒక ఏజెన్సీ/వ్యక్తిని కాంట్రాక్టర్‌గా నమోదు చేసేందుకు కాంట్రాక్టర్ గత అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటూ బ్లాక్ పీరియడ్‌ను ఐదు సంవత్సరాల నుండి పదేళ్లకు పెంచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
4. జలవనరుల శాఖ
‘జలహారతి కార్పొరేషన్‘ పేరుతో కంపెనీల చట్టం, 2013 ప్రకారం 100% రాష్ట్ర యాజమాన్య కంపెనీగా ప్రత్యేక ప్రయోజన వాహనం ఏర్పాటు కోసం డైరెక్టర్ల బోర్డు సంస్థకు సంబంధించి జీవో ఎంఎస్ నంబరు 16, నీటి వనరుల (ప్రాజెక్ట్స్–2 ) శాఖ, తేదీ 08.04.2025 లో జారీ చేసిన ఉత్తర్వులను సవరించడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
5. జలవనరుల శాఖ
2025–26 సంవత్సరానికి పెద్ద, మధ్యమ చిన్న నీటిపారుదల వనరులకు సంబంధించి రూ. 345.39 కోట్లతో 7174 ఆపరేషన్ మరియు నిర్వహణ పనులకు పరిపాలనా ఆమోదం కోసం మరియు నీటి వినియోగదారుల సంఘాలు అందుబాటులో లేని 7 రోజులలోపు రూ.10.00 లక్షల విలువ కంటే పైబడిన పనులకు స్వల్పకాలిక టెండర్ నోటీసును ఆహ్వానించడానికి అనుమతించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
6. జలవనరుల శాఖ
వాణిజ్యేతర ప్రయోజనాల కోసమై రైతులు తమ స్వంత ఖర్చులతో చిన్న నీటిపారుదల చెరువుల నుండి మట్టి తవ్వకం మరియు రవాణాకు అనుమతించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
7. ఎల్‌ఎఫ్‌బి అండ్ ఐఎంఎస్ విభాగం (కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు – బీమా వైద్య సేవలు)
భారత రాష్ట్రపతి ఆమోదం కోసం వేచిఉన్న ‘పారిశ్రామిక వివాదాల (ఆంధ్రప్రదేశ్ సవరణ) బిల్లు, 2019‘ ను ఉపసంహరించుకునే చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
8. ఎల్‌ఎఫ్‌బి–ఐఎంఎస్ విభాగం (కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు – బీమా వైద్య సేవలు)
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వద్ద పెండింగ్‌లో ఉన్న ‘‘కార్మిక చట్టాలు (ఆంధ్రప్రదేశ్ నేరాల సమ్మేళనం కోసం సవరణ) బిల్లు, 2019 (ఎల్.ఎ.బిల్ నెం.9 ఆఫ్ 2019) ను ఉపసంహరించుకునే చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
9. ఎల్‌ఎఫ్‌బి – ఐఎంఎస్ విభాగం (కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు – బీమా వైద్య సేవలు)
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వద్ద పెండింగ్‌లో ఉన్న ‘‘ఫ్యాక్టరీల (ఆంధ్రప్రదేశ్ సవరణ) బిల్లు, 2019’’ ను ఉపసంహరించుకునేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
10.పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివద్ధి మరియు మత్స్య శాఖ
ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు నిషేధ కాలంలో సముద్ర చేపల వేట నిషేధ ఉపశమనంగా ప్రతి కుటుంబానికి అందజేస్తున్న రూ.10,000/– లను రూ.20,000/– కు పెంచుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.258.35 కోట్ల మేర లబ్ది చేకూర్చే విధంగా జీవో ఎంఎస్ నంబరు 12, ఏహెచ్‌డిడి అండ్ ఎఫ్ డిపార్ట్‌మెంట్, 25.04.2025 లో జారీ చేయబడిన ఉత్తర్వులను ఆమోదించడానికి చేసిన ప్రతిపాదనకు 2025–26 ఆర్థిక సంవత్సరం నుండి ఈ పథకం పేరును ‘మెరైన్ ఫిషింగ్ బ్యాన్ రిలీఫ్‘ గా పునరుద్ధరించడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
11. రెవెన్యూ (భూములు)
కడప జిల్లా కొండాపూర్ (మం), కె.బొమ్మేపల్లి (గ్రా) లోని సర్వే నెం.307లో ఉన్న 150.00 ఎకరాలు సర్వే నెం.308లో ఎక.41.64 సెం., మొత్తం ఎక.191.64 సెం. భూమిని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా 1000 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ స్థాపించడానికి ఎన్‌ఆర్‌ఈడిసీఏపీకు కౌలు ప్రాతిపదికన కేటాయించడానికి ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు ఎకరానికి సంవత్సరానికి రూ.31,000ల కౌలు రేటుతో, ప్రతి రెండు సంవత్సరాలకు 5% పెరుగుదలతో ప్రాజెక్టు కాలం (40 సంవత్సరాల నిర్వహణ కాలం 6 సంవత్సరాల నిర్మాణ కాలం, మొత్తం 46 సంవత్సరాలు) పాటు అనుమతించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
12. రెవెన్యూ (భూములు)
డా. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాట్రేనికోన (మం), చిర్రయనం (గ్రా)లో సర్వే నెం.1లో గల ఎక.5.00 సెం. ప్రభుత్వ భూమిలో ప్లూటస్ అక్వాకు బురద పీతల హ్యాచరీ స్థాపించడానికి మార్కెట్ విలువ చెల్లింపుపై ఏడాదికి ఎకరానికి రూ.2.50 లక్షల లీజు ప్రాతిపదికన 15 సంవత్సరాల కాల పరిమితికి కేటాయిస్తూ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
13. రెవెన్యూ (భూములు)
కర్నూలు రూరల్ (మం), బి.తండ్రపాడు గ్రామంలో సర్వే నెం.277/7ఆలో ఎక.1.95 సెం. భూమిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ కోసం ఎల్‌ఎన్‌జీ హబ్ స్థాపించడానికి బీఎస్‌ఓ 24 ప్రకారం జీవో ఎంఎస్ నంబరు 571 రెవిన్యూ శాఖ, తే.14.09.2012 ప్రకారం ఎకరానికి రూ.61,23,516 మార్కెట్ విలువ చెల్లించిన తదుపరి బదిలీ చేయుటకు కర్నూలు పట్టణాభివృద్ది సంస్థ ఆమోదించిన మాస్టర్ ప్లాన్ లో మిశ్రమ, నివాస భూ వినియోగం నుండి పారిశ్రామిక వినియోగానికి మార్పిడి చేయుటకు ఇతర సాధారణ షరతులకు లోబడి కేటాయించడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
14. రెవెన్యూ (భూములు)
విశాఖపట్నం జిల్లా, భీమునిపట్నం మండలం, అన్నవరం గ్రామంలోని సర్వే నెం.101/1లో గల ఎక.18.70 సెం. ప్రభుత్వ భూములను బీచ్ రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ, విజయవాడకి బదిలీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
15. రెవెన్యూ (భూములు)
చిత్తూరు జిల్లా కుప్పం (మం) పాలర్లపల్లె (గ్రా) సర్వే నెం.221లో గల ఎక.18.70 సెం. ప్రభుత్వ భూమిని పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి జీవో ఎంఎస్ నంబరు 106, రెవెన్యూ శాఖ, తేదీ.16.03.2017 ప్రకారం ఉచితంగా కేటాయించడానికి చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
16.రెవెన్యూ (దేవాదాయ)
టీటీడీలోని ఐటి విభాగంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఐటి) పోస్టును జనరల్ మేనేజర్ (ఐటి)గా అప్‌గ్రేడ్ చేయడానికి, ఆ పోస్టు వేతన స్కేలును టీటీడీలో సూపరింటెండింగ్ ఇంజనీర్ స్కేలు రూ.1,01,970–1,74,790 (ఆర్‌పీఎస్ –2022) తో సమానం ఖరారు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
17. రెవెన్యూ (దేవాదాయ)
టీటీడీలోలో అర్బన్ డిజైన్ – ప్లానింగ్ సెల్ ఏర్పాటు చేయడానికి, ప్రతిపాదిత యుడీపీ సెల్‌కు నూతనంగా (8) పోస్టుల కల్పనకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
18. యువజన, క్రీడా, పర్యాటక – సాంస్కృతిక శాఖ (పర్యాటకం)
ఏపీ పర్యాటక విధానం 2024–29 కి అనుబంధంగా తీసుకు వచ్చిన ఉపాధి కల్పన ప్రోత్సాహక విధానంకి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా రాబోయే ఐదేళ్లలో పర్యాటక రంగంలో ఉద్యోగాలు కల్పించే సంస్థలకు రూ.24.70 కోట్లు ఉద్యోగ కల్పన ప్రోత్సహలుగా అందజేస్తారు.
19.యువజన, క్రీడా, పర్యాటక – సాంస్కృతిక శాఖ (పర్యాటకం)
2025–26 ఆర్థిక సంవత్సరానికి కార్యక్రమాలు ఈవెంట్‌ల నిర్వహణ కోసం ఏపీ పర్యాటక అథారిటీకి గ్రాంట్స్–ఇన్–ఎయిడ్ కింద రూ.78.00 కోట్ల బడ్జెట్ ను కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
20.ఇంధన శాఖ
ఏపీపీడీసీఎల్ సంస్థల ఆస్తులను నిరర్థక ఆస్తిగా ప్రకటించకుండా ఉండేందుకు, ఏపీజెన్కో సంస్థ రూ.650.00 కోట్ల మధ్యకాలిక రుణం ఏపీపీడీసీఎల్ సంస్థకు అందించేందుకు గతంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించాల్సిందిగా చేసిన ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
21. పట్టణాభివృద్ధి – పురపాలక శాఖ
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(ఏపీసీఆర్‌డిఏ) కమిషనర్‌కు మొత్తం రూ.1732.306 కోట్ల విలువగల నాలుగు పనుల కోసం స్వల్ప ధరలను ఆమోదించుటకు, ఈ పనులను ఎల్ 1 బిడ్డరులకు అప్పగించేందుకు ఒప్పందపత్రాలను జారీ చేయుటకు ఏపీసీఆర్‌డిఏ తీర్మానాలు 529/2025 నుండి 532/2025 ద్వారా ఆమోదించిన నిర్ణయాలను అమలుపరచుటకు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
22. పట్టణాభివృద్ధి – పురపాలక శాఖ
అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, విజయవాడ చైర్‌పర్సన్ – మేనేజింగ్ డైరెక్టర్‌కు రెండు ప్యాకేజీల పనులకు ఎల్1 బిడ్‌లను ఆమోదించడానికి అధికారమిచ్చే ప్రతిపాదనకు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది.
23. పట్టణాభివృద్ధి – పురపాలక శాఖ
ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో అమలవుతున్న అమరావతి రాజధాని నగర అభివృద్ధి కార్యక్రమాలకు పనులు చేపట్టడానికి, అదనపు అనుబంధ పనులతో సహా నిర్వహణకు సంబంధించిన విషయాలకు మొత్తం రూ.560.57 కోట్ల మేరకు పరిపాలనా మంజూరు ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
24. పట్టణాభివృద్ధి – పురపాలక శాఖ
ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఆర్థిక సహాయంతో అమరావతి రాజధాని నగర అభివృద్ధి కార్యక్రమం కింద రూ.494.86 కోట్ల మొత్తానికి పరిపాలన మంజూరు, ఇతర అనుబంధ పనులు, 5 సంవత్సరాల నిర్వహణ, మెయింటెనెన్స్‌తో పాటు, అమరావతి, ఆంధ్రప్రదేశ్‌లో డిజైన్, బిల్డ్ అండ్ ఆపరేట్ పద్ధతిలో ఇవ్వడానికి చేసిన ప్రతిపాదనలను మంత్రి మండలి ఆమోదించింది.
25. పట్టణాభివృద్ధి – పురపాలక శాఖ
ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి–16కి అనుసంధానమయ్యే ఇంటర్‌చేంజ్‌తో పాటు, వంతెనలు, అండర్‌పాస్‌లు యుటిలిటీలతో కూడిన 6–లేన్ల ఎలివేటెడ్ కారిడార్‌తో మూడవ దశ విస్తరణ నిర్మాణం కోసం మొత్తం రూ.593.03 కోట్ల మేరకు పరిపాలనా మంజూరు ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పరిపాలనా మంజూరు వలన అమరావతి రాజధాని నగర ప్రాంతంలోని రహదారి వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు సమీప ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది.
26. పట్టణాభివృద్ధి – పురపాలక శాఖ
సీఆర్డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు కేటాయించిన భూముల పునః సమీక్ష విషయంలో మంత్రుల బృందం 17వ సమావేశంలోని చేసిన సిఫార్సులను అలాగే అమరావతి భూ కేటాయింపు నిబంధనలు 2017 అమరావతి భూ కేటాయింపు నియంత్రణలు 2017 ప్రకారం మంత్రుల బృందం సిఫార్సులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకునేందుకు ఏపీసీఆర్‌డిఏ కమిషనర్‌కు అనుమతినివ్వాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సమీక్ష ద్వారా భూ కేటాయింపుల్లో సమగ్రత, పారదర్శకత మరియు సమర్థవంతమైన వినియోగాన్ని నిర్ధారించడం ప్రధాన లక్ష్యం.
27. పట్టణాభివద్ధి – పురపాలక శాఖ
వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ దాని కన్సార్టియం బదులుగా వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద అమ్మకం ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆమోదం కొరకు చేసిన ప్రతిపాదన హయాట్ బ్రాండ్‌తో అనుబంధం ఉన్న ఓం శ్రీ భవాన సాయి అసోసియేట్స్ బదులుగాశ్రీ భవాన సాయి అసోసియేట్స్ పేరు మీద అమ్మకం ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆమోదం చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
28. పెట్టుబడులు మౌలిక సధుపాయాల కల్పన శాఖ
నెల్లూరుజిల్లా, గుడ్లూరుమండలం, రావూరుగ్రామంలో ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా పారిశ్రామిక హబ్ నిర్మాణం కోసం జరుపుతున్న భూ సేకరణకు పరిహారాన్ని ఎకరాకు రూ.4 లక్షలకు పెంచుతూ నిర్ణయించడం జరిగింది. దీనితో భూ సేకరణ చట్ట ప్రకారం ఎకరాకు రూ. 16లక్షలు మాత్రమే వున్న పరిహారాన్ని పెంచి తమకు న్యాయం చేయాలని కోరుతున్న భూములిచ్చిన రైతుల డిమాండును ఆమోదిస్తూ పరిహారాన్ని ఎకరాకు రూ. 20 లక్షలుగా నిర్ణయించింది. ఈ పరిహారం పెంపువల్ల ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు చేపట్టిన పారిశ్రామికవాడ ఏర్పాటు ఊపందుకొని పోర్టు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా ఉద్యోగావకాశాలు కూడా ఏర్పడతాయి. ఈ ప్రాంతం ఆర్ధికంగా అభివృద్ధి చెందుతుంది.
29. పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ
ఏపీ మారిటైమ్ బోర్డు పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఓడరేవుకు సమీపంలో ఉన్న భూములను, సేకరించిన సేకరణ ప్రక్రియలో ఉన్న భూములను, భవిష్యత్తులో సేకరించబోయే భూములను ప్రభుత్వ ఉప్పు భూములను పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ కు బదిలీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
30. రెవెన్యూ (భూములు)
నెల్లూరు జిల్లా, నెల్లూరు బిట్–2 గ్రామంలోని సర్వే నెం.2062–3లో గల ఎక.36.00 సెం. భూమి వర్గీకరణను ‘పెన్నా నది పొరంబోకు‘ నుండి ‘ఏడబ్ల్యూడ్రైగా మార్చడానికి, కొత్త సర్వే నెం.2224 çసృషించి భగత్ సింగ్ కాలనీ నివాసితులకు పట్టాలు మంజూరు చేసే సులభతర ప్రక్రియకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు అనుమతి ఇవ్వడానికి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మండలి ఆమోదం తెలిపింది.