"పరకామణి అసలు దొంగ కరుణాకర్ రెడ్డే"

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, సభ్యుడు భానూ సంచలన ఆరోపణ

Update: 2025-09-21 03:00 GMT
తి­రు­మల తి­రు­ప­తి దే­వ­స్థా­నం (టీ­టీ­డీ) పరి­ధి­లో­ని పర­కా­మ­ణి వి­భా­గం­లో జరి­గిన భారీ చో­రీ వ్యవహారం రాష్ట్రంలో మంటలు రేపుతోంది. ఇందులో వైసీపీ హస్తం ఉందని సాక్షాత్తు రాష్ట్రమంత్రి నారా లోకేశ్ ఆరోపించగా తాజాగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పరకామణిలో అసలు నేరస్తుడు మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి అని ఆరోపించారు.­

తిరుమల తిరుపతి శ్రీవారి పరకామణిలో నగదు చోరీ కేసులో టీడీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డే గజదొంగ అని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఆరోపించారు. ఈ కేసులో కోట్ల రూపాయల నగదు, బంగారం, ఇతర విలువైన ఆస్తులను విజిలెన్స్‌ పట్టుకున్నా లెక్కలు మాత్రం కొన్నింటికే చూపించారని పేర్కొన్నారు. కొన్ని ఆస్తులను టీటీడీకి అప్పగించి మిగతావి కరుణాకరరెడ్డి కాజేశారని ఆరోపించారు. అంత భారీ కుంభకోణం జరిగితే అప్పటి పోలీసులు, టీడీడీ ఉన్నతాధికారులు తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతో లోక్‌అదాలత్‌లో కేసు రాజీ చేయించారని ఆరోపించారు.
ఈ కేసులో కీలకమైన రవికుమార్‌ ముందుకొచ్చి, అన్ని వివరాలూ వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నూతన ధర్మకర్తల మండలి ఏర్పడిన పది నెలల నుంచి ఒక్క రూపాయి అవినీతి కూడా లేకుండా నడిపిస్తుంటే.. దీన్ని ఓర్వలేక టీడీడీ ప్రతిష్ఠను, హిందువుల మనోభావాలను కరుణాకరరెడ్డి దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
భానూ ప్రకాశ్ రెడ్డి సంచలన ప్రకటన..
తి­రు­మల తి­రు­ప­తి దే­వ­స్థా­నం (టీ­టీ­డీ) పరి­ధి­లో­ని పర­కా­మ­ణి వి­భా­గం­లో జరి­గిన భారీ చో­రీ­పై టీ­టీ­డీ సభ్యు­డు భా­ను­ప్ర­కా­ష్‌­రె­డ్డి సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. ఈమేరకు ఒక వీ­డి­యో­ను వి­డు­దల చేశారు. పర­కా­మ­ణి­లో రవి­కు­మా­ర్‌ అనే వ్య­క్తి దో­చు­కు­న్న దృ­శ్యా­లు అం­దు­లో ఉన్నా­య­ని తె­లి­పా­రు. దొం­గ­త­నా­ని­కి వై­సీ­పీ నా­య­కు­లు, అధి­కా­రుల సహ­కా­రం ఉన్న­ట్లు భా­ను­ప్ర­కా­ష్‌­రె­డ్డి పే­ర్కొ­న్నా­రు.


 


కో­ట్లా­ది రూ­పా­యల వి­లు­వైన డబ్బు­ను రి­య­ల్ ఎస్టే­ట్‌­లో పె­ట్టు­బ­డి చే­శా­ర­ని వి­వ­రిం­చా­రు. "ఓ దొంగ నుం­చి మి­గి­లిన దొం­గ­లు అం­ద­రూ స్వా­మి­వా­రి సొ­మ్ము­ను దో­చు­కు­న్నా­రు.. గత వై­సీ­పీ ప్ర­భు­త్వ హా­యం­లో తి­రు­మల స్వా­మి­వా­రి పర­కా­మ­ణి­లో వంద కో­ట్ల దొం­గ­త­నం చే­శా­ర­ని" ఆరో­పిం­చా­రు. టీ­టీ­డీ చరి­త్ర­లో అత్యంత భారీ దొం­గ­త­నం గత ప్ర­భు­త్వం­లో జరి­గిం­ది అని టీ­టీ­డీ సభ్యు­డు భా­ను­ప్ర­కా­ష్‌­రె­డ్డి అన్నా­రు.
"స్వా­మి­వా­రి­కి భక్తు­లు ఎంతో భక్తి­తో కా­ను­క­లు హుం­డీ­లో వే­స్తే వా­టి­ని దో­చు­కు­న్నా­రు.. రూ. 100 కో­ట్ల పైగా పర­కా­మ­ణి­లో దొం­గ­త­నం చే­శా­రు‌.‌ ఈ కే­సు­ను హై­కో­ర్టు సీ­ఐ­డీ­కి అప్ప­గిం­చిం­ది.. వచ్చే నెల రో­జు­ల్లో సీ­ల్డ్ కవ­ర్లో వి­చా­రణ జరి­పి ని­వే­దిక ఇవ్వా­ల­ని ఆదే­శిం­చిం­ది.. దా­ని­కి సం­బం­ధిం­చిన బో­ర్డు ని­ర్ణ­యా­ల­ను ఇతర డా­క్యు­మెం­ట్ల­ను అన్ని­టి­ని సీజ్ చే­యా­ల­ని ఆదే­శిం­చిం­ది" అని భాను ప్ర­కా­ష్ రె­డ్డి పే­ర్కొ­న్నా­రు.
అప్ప­ట్లో టీ­టీ­డీ చై­ర్మ­న్‌­గా భూమన కరు­ణా­క­ర్‌­రె­డ్డి ఉన్నా­ర­ని, ఆయన ఈ వి­ష­యం­పై స్ప­ష్టత ఇవ్వా­ల్సిన అవ­స­రం ఉం­ద­ని అన్నా­రు. లోక్ అదాలత్‌లో రాజీ చేస్తారా..? అప్ప­ట్లో కే­సు­ను లోక్ అదా­ల­త్ ద్వా­రా రా­జీ­కి వె­ళ్ళా­ర­ని టీ­టీ­డీ సభ్యు­లు భాను ప్ర­కా­ష్ రె­డ్డి తె­లి­పా­రు. "కే­సు­లో చాలా మంది వై­సీ­పీ ప్ర­ము­ఖుల నుం­చి ఉన్న­తా­ధి­కా­రుల వరకు అం­ద­రూ భా­గ­స్వా­మ్య­లు­గా ఉన్నా­రు, త్వ­ర­లో­నే వా­రం­ద­రి పే­ర్లు బయ­ట­కు వస్తాయి. త్వ­ర­లో ఓ అధి­కా­రి పశ్చా­త్తా­పం వ్య­క్తం చే­స్తూ ఈ రూ. 100 కో­ట్ల స్కాం­కు సం­బం­ధిం­చిన అన్ని వి­వ­రా­ల­ను బయట పె­ట్ట­బో­తు­న్నా­రు.. స్వా­మి­వా­రి సొ­త్తు­ను కీ­ల­క­మైన ఓ పో­లీ­స్ అధి­కా­రి దో­చు­కో­వ­డ­మే లక్ష్యం­గా పని చే­శా­రు" అన్నారు.
"వై­సీ­పీ నా­య­కు­లు అం­ద­రి­కి ఇం­దు­లో వా­టా­లు వె­ళ్ళా­యి.. అప్ప­టి అధి­కా­రు­లు ఈ సొ­మ్ము­ను పం­చు­కు­న్నా­రు.. దో­చు­కు­న్న సొ­మ్ము­లో కొంత తా­డే­ప­ల్లి ప్యా­లె­స్ కి చే­ర్చా­రని" భాను ప్ర­కా­ష్ రె­డ్డి ఆరో­పిం­చా­రు. ఎవ­రి­ని తప్పిం­చ­డా­ని­కి అప్ప­టి అధి­కా­రు­లు రా­జీ­కి వె­ళ్లా­ర­ని ఆయన ప్ర­శ్నిం­చా­రు. పో­లీ­సుల నుం­చి వచ్చిన ఒత్తి­డి కా­ర­ణం­గా.. రాజీ చే­సు­కు­న్నా­మ­ని టీ­టీ­డీ వి­జి­లె­న్స్ రి­పో­ర్టు­లో­ఉం­ద­న్నా­రు. ఒత్తి­డి తె­చ్చిన ఆ పో­లీ­సు అధి­కా­రి ఎవరో ముం­దు తే­ల్చా­ల­ని భాను ప్ర­కా­శ్ రె­డ్డి డి­మాం­డ్ చే­శా­రు. పర­కా­మ­ణి­లో పె­ద్ద­జీ­య­ర్‌ తర­ఫున సి.వి.రవి­కు­మా­ర్‌ అనే వ్య­క్తి వి­దే­శీ కరె­న్సీ­ని లెక్కిం­చే వా­ర­ని, కొ­న్నే­ళ్లు­గా రహ­స్యం­గా దా­దా­పు­గా రూ. 200 కో­ట్ల వి­లు­వైన వి­దే­శీ కరె­న్సీ­ని బయ­ట­కు తర­లిం­చి­న­ట్లు అను­మా­నా­లు ఉన్నా­య­ని భానూ ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు..
Tags:    

Similar News