సీపీడీఆర్ ఎస్ అధ్యక్షులుగా జస్టిస్ పట్నాయక్
సలహాదారుగా జస్టిస్ శ్రీకృష్ణ;
సెంటర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ అండ్ సెక్యులరిజం (CPDRS) జాతీయ అధ్యక్షులుగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏ.కె.పట్నాయక్ ను ఎన్నుకున్నారు. ఏడుగురు జాతీయ ప్రధాన సలహాదారుల్లో ఒకరిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణను ఎన్నుకున్నారు. న్యూఢిల్లీలోని గాలిబ్ ఇనిస్టిట్యూట్ హాల్ లో గత ఆదివారం జరిగిన మానవహక్కుల జాతీయ సదస్సులో ఈ మేరకు సీపీడీఆర్ ఎస్ నూతన జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్న ట్టు సీపీడీఆర్ ఎస్ నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రొఫెసర్ కుంచె శ్రీధర్ ప్రకటించారు.
సీపీడీఆర్ ఎస్ ప్రధాన జాతీయ సలహాదారుల్లో జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ తో పాటు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, పశ్చిమ బెంగాల్ మాజీ అడ్వొకేట్ జనరల్ బిమల్ ఛటర్జీ, కోల్ కతా హైకోర్టు సీనియర్ న్యాయవాది పార్థ సారథి సేన్ గుప్త, మానవ హక్కుల కార్యకర్తలు సుజాతొ భద్ర, ద్వైరకానాథ్ రథ్, ముంబై మాజీ ఆదాయ పన్ను శాఖ కమిషనర్ అరవింద్ శొంటెకె, సుప్రీం కోర్టు న్యాయవాది అనిల్ నౌరియాలను ఎన్నుకున్నారు.
జాతీయ ఉపాధ్యక్షులుగా బీహార్ కు చెందిన సీనియర్ న్యాయవాది విజయ్ కాంత్ ఝా, బీహార్ మాజీ ఐపీఎస్ అధికారి అమితవ్ కుమార్ దాస్, బీహార్ కు చెందిన న్యాయకోవిదులు గోపాల కృష్ణ, ఒరిస్సాకు చెందిన సామాజిక కార్యకర్త బిశ్వబసు దాస్, పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రొఫెసర్ సౌమ్యాసేన్. ఢిల్లీకి చెందిన సామాజిక కార్యకర్త ప్రాణ్ శర్మ, పశ్చిమ బెంగాల్ లోని లీగల్ సర్వీస్ సెంటర్ కు చెందిన రూపం చౌదరి, కేరళకు చెందిన సామాజిక కార్యకర్త జోసఫ్ సి.మాథ్యివ్, ఢిల్లీకి చెందిన ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ దిబియేందు మైథి, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ కు చెందిన సామాజిక కార్యకర్త ప్రభాత్ రాయ్ లను ఎన్నుకున్నారు.
సీపీడీఆర్ ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రొఫెసర్ కుంచె శ్రీధర్, సహాయ కార్యదర్శిగా ప్రొఫెసర్ గౌరంగ దేబ్ నాథ్, కోశాధికారిగా ఎం.ఎన్.శ్రీరాం, కార్యాలయ కార్యదర్శిగా రేష్మా సింగ్ ఎన్నికయ్యారు.
సీపీడీఆర్ ఎస్ జాతీయ కమిటీ కార్యవర్గ సభ్యులుగా లక్నోకు చెందిన బీరేంద్ర త్రిపాటి, ఉత్తర ప్రదేశ్ కు చెందిన పద్మకుమార్ శుక్ల, మధ్య ప్రదేశ్ కు చెందిన లోకేష్ శర్మ. పశ్చిమ బెంగాల్ కుచెందిన రాజ్ కుమార్ బాసక్, నవేందు పాల్, బీహార్ కు చెందిన రాజ్ కుమార్ చౌదరి, ఉత్తరాఖండ్ కు చెందిన ముఖేష్ సెమివాల్, గుజరాత్ కు చెందిన బావికా రాజా, కర్ణాటకకు చెందిన ఎన్. రవి, తెలంగాణాకు చెందిన జానీబాషా, హర్యానాకు చెందిన ఈశ్వర్ సింగ్ రాథి, త్రిపురకు చెందిన సుబ్రత్ చక్రవర్తి, పశ్చిమ బెంగాల్ కు చెందిన అబ్దుల్ రవుఫ్ అహ్మద్, జనన్ తోష్ ప్రమానిక లను ఎన్నుకున్నారు.
జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ (తిరుపతి)కి చెందిన ఏ. హరిష్, జనార్ధన్ (ఢిల్లీ), తెలంగాణాకు చెందిన న్యాయవాది ఎస్.మధు, కర్ణాటకకు చెందిన ఎస్. ఏ. ప్రవీణ్, కేరళకు చెందిన ప్రాన్సిస్ కలాంతుల్ కల్, తమిళనాడుకు చెందిన గణేషన్ సుబ్బు, జార్ఖండ్ కు చెందిన అషీష్ దాస్, ఛత్తీస్ ఘర్ కు చెందిన పూజా శర్మ, ఢిల్లీకి చెందిన శారదా దీక్షిత్, పశ్చిమ బెంగాల్ కు చెందిన మంగల్ నాయక్, అస్సాంకు చెందిన సంజిత రాజ్ బాంగ్ క్షి, మధ్యప్రదేశ్ కు చెందిన పరుల్ శర్మ, తమిళనాడుకు చెందిన బాలసుబ్రమణ్యం, పంజాబ్ కు చెందిన గురుచరణ్ సింగ్ ఎన్నికయ్యారు.