ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ప్రమాణ స్వీకారం

ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ జస్టిస్‌ బట్టు దేవానంద్‌ చేత ప్రమాణం చేయించారు.;

Update: 2025-07-28 08:17 GMT

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మద్రాసు హైకోర్టు నుండి బదిలీపై ఏపీ హైకోర్టుకు వచ్చిన ఆయనచేత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం చేయించారు. జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మద్రాసు హైకోర్టు నుండి ఆంధ్రప్రదేశ్‌కు రావడంతో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులోని న్యాయమూర్తుల సంఖ్య ప్రస్తుతం 29కి చేరింది. జస్టిస్‌ బట్టు దేవానంద్‌ పదవీ కాలం కూడా మరో మూడేళ్లు ఉంది. 2028 ఏప్రిల్‌ 13 వరకు ఆయనకు పదవీ కాలం ఉంది.

ఏపీ హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు ద్వారకానాధ్‌ రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కె.చిదంబరం, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ధనంజయ, అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పి.సాంబశివ ప్రతాప్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎం.లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిష్ట్రార్‌ జనరల్‌ పార్థసార«థి, పలువురు ఇతర రిజిష్ట్రార్లు, సీనియర్‌ న్యాయవాదులు, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, ఏపీ లీగల్‌ సర్వీసెస్‌ అధారిటీ, ఏపీ జుడీషియల్‌ అకాడమీ ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags:    

Similar News