మాట వింటావా..? మూట 'ముల్లె' సర్దుకుంటావా? హెచ్చరించిన జగన్

చెప్పిన మాట వినండి. లేదంటే మీ ఇష్టం అని 'పులివెందులలో చేసిన పంచాయితీ'లో జగన్ తెగేసి చెప్పారని తెలిసింది. జనం మధ్య ఉండాలని కూడా హితోపదేశం చేశారని తెలుస్తోంది.

Update: 2024-10-30 08:37 GMT

పార్టీ పునర్ నిర్మాణంపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ దృష్టి పెట్టారు. సొంత జిల్లా కడప నుంచి ప్రారంభించారు. మూడు రోజుల పర్యటనకు మంగళవారం ఆయన పులివెందులకు వచ్చిన జగన్ మొదటిరోజు జిల్లాలోని నాయకులతో విడివిడిగా భేటీ అయ్యారు. పులివెందులలో నాయకుల మధ్య పంచాయతీ తెంచారు. "ఐదు ఊర్లు ఇచ్చినా చాలు" అన్నట్లు నేతలకు మండలాల పార్టీ బాధ్యతలు అప్పగించారు. గీత దాటితే, వేటు తప్పదనే సంకేతం కూడా ఇచ్చినట్లు కనిపిస్తోంది.

జమిలీ ఎన్నికల వార్తలు వినిపించడడానికి ముందే వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్. జగన్ అలర్ట్ అయ్యారు. గత నెల నుంచి మొదటి దశగా అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఓటమి చెందిన ప్రజా ప్రతినిధులతో తాడేపల్లిలో సమీక్షించారు. కొన్ని జిల్లాల అధ్యక్షులను మార్చడంతో పాటు, రాష్ట్ర కార్యవర్గంలో కూడా కొందరికి బాధ్యతలు అప్పగించారు. మూడో దశలో జిల్లాల్లోనే నాయకులతో సమీక్షించడానికి రంగంలోకి దిగారు . విజయదశమి తర్వాత జిల్లాలోని పార్టీ నాయకులతో స్వయంగా సమీక్షించడానికి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లోనే ఆ విషయం స్పష్టం చేశారు. అందులో భాగంగా మూడు రోజుల పర్యటనకు వచ్చిన జగన్ పులివెందులలో మకాం వేశారు. పార్టీ పునర్ నిర్మాణానికి కడప నుంచే శ్రీకారం చుట్టారు.

నేతలతో పంచాయితీ
పులివెందుల క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గాల నేతల మధ్య పంచాయతీ నిర్వహించారని సమాచారం. ఉమ్మడి కడప జిల్లాలో జమ్మలమడుగు, కడప అసెంబ్లీ సెగ్మెంట్లలో నాయకుల మధ్య సమన్వయం కొరవడింది. దీనిపై దృష్టి సారించినట్లు పార్టీవర్గాల సమాచారం. మంకుపట్టుతో వ్యవహరిస్తున్న నాయకులకు తీవ్రంగానే హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలిసింది. పార్టీ అధ్యక్షుడు అనుమతి లేకుండా కూడా కార్యక్రమాలు నిర్వహించవద్దని, పరిధిదాటితే వేటు తప్పదనే అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తోంది. "అధికార పార్టీ నుంచి సవాళ్లు ఎక్కువగా ఉన్నాయి. మనకు ఆల్రెడీ 40 శాతం ఓటు బ్యాంకు ఉంది. సమన్వయంతో పని చేయాల్సిన సమయం ఇదే" అని నాయకులకు జగన్ హెచ్చరికతో కూడిన కర్తవ్య బోధ చేసినట్లు తెలుస్తోంది.
మూడేసి మండలాల పంపకం
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో మాజీ ఎమ్మెల్యే మూలె సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి పీ. రామసుబ్బారెడ్డి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దీనివల్లనే పార్టీకి నష్టం జరిగిందని అభిప్రాయానికి జగన్ వచ్చినట్లు భావిస్తున్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి జమ్మలమడుగు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి తిరగబడింది. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి రెండు ఏళ్ల తర్వాత టిడిపిలోకి వెళ్లి మంత్రి అయ్యారు. దీంతో,
2019 ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి డాక్టర్ మూలె సుధీర్ రెడ్డిని బరిలోకి దించి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిపించారు. స్వల్ప వ్యవధిలోనే ఆయనపై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. కాగా,
టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి పొన్నపురెడ్డి శివారెడ్డి రాజకీయంగా చక్రం తిప్పారు. ఆయన హత్య తర్వాత కొడుకు పి. రామ సుబ్బారెడ్డి రాజకీయ తెరపైకి వచ్చారు. టీడీపీలో మంత్రిగా కూడా పనిచేశారు. వీరి కుటుంబానికి రాజకీయ శత్రువుగా మారిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీలో మరో కేంద్ర బిందువుగా మారారు. దీనిపై అప్పట్లో సీఎం చంద్రబాబు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. కడప ఎంపీగా పోటీచేసిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా ఓటమి చెందారు. "దీర్ఘకాarక రాజకీయ విరోధితో మనలేను" టన్నట్లు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో..
2020 మార్చి 11వ తేదీ పి. రామ సుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. దీంతో తనకు పోటీగా మారారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ములే సుధీర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో..
2024 ఎన్నికల్లో సుధీర్ రెడ్డి సీపీపి నుంచి మళ్లీ పోటీ చేసి ఓటమి చెందారు. అంతకు ముందు నుంచే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డితో సుధీర్ రెడ్డి కి సఖ్యత లేదనే విషయం బహిరంగ రహస్యం. దీంతో పార్టీ మనగడ ప్రశ్నార్థకం కాకూడదనే దిశగా జగన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా
మండలాల పంపిణీ

పులివెందుల క్యాంప్ కార్యాలయంలో జగన్ నియోజకవర్గాల వారీగా నాయకులతో సమీక్షలు నిర్వహించారు. అందులో..
జమ్మలమడుగు అసెంబ్లీ సెగ్మెంట్ పరిస్థితిపై సమీక్షించారు. నియోజకవర్గంలో ఎవరికి వారుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డితో సుదీర్ఘంగానే సమీక్షించడంతోపాటు గట్టి హెచ్చరికలతో రాజీ కుదిర్చి, పంపినట్లు పార్టీ వర్గాల సమాచారం. నియోజకవర్గంలో "చెరి మూడు మండలాల బాధ్యతలు తీసుకోండి" అని జగన్ వారిద్దరికీ తెగేసి చెప్పారని తెలిసింది. "మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో కలిసి సాగడం ఇష్టం లేదన్నట్టు"మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పులివెందుల క్యాంప్ కార్యాలయం నుంచి వెనుదిరగబోతే "చెప్పిన మాట వినకపోతే ఆ మూడు మండలాల బాధ్యతలు కూడా ఉండవు" అని జగన్ గట్టిగానే సుధీర్ రెడ్డిని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

ఇరువురు నేతలకు జగన్ మండలాల బాధ్యతలను వీకేంద్రీకరించినట్లు తెలిసింది. అందులో, జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం మండలాలు రామసుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. మిగతా ముద్దనూరు, మైలవరం, యర్రగుంట్ల మండలాలు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కేటాయించారు.
కండీషన్ : ఆ మూడు మండలాల్లో కూడా పార్టీ కలాపాలు సాగించాలంటే విధిగా జిల్లా అధ్యక్షుడి అనుమతి తీసుకోవాలని కూడా సుధీర్ రెడ్డికి షరతు విధించినట్లు తెలిసింది. కడప జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్ మేనమామ, మాజీ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథరెడ్డి కావడం గమనార్హం. "చెప్పిన మాట వినకుంటే, ఇక నీ ఇష్టం. ఉంటే ఉండవచ్చు. పోతే పోవచ్చు" అనే మాట చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది.
జనంలో ఉండు బాషాభాయ్
కడప అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా నాయకుల మధ్య ఎడతెగని పంచాయితీ తీరింది. కడప నుంచి డిప్యూటీ మాజీ సీఎం అంజాద్ బాషాకు గట్టిగానే జగన్ క్లాస్ పీకారని తెలిసింది. అధికారంలో ఉన్నప్పుడు కాదు. ఓడినా జనంలో ఉండాలి. సమస్యలు పట్టించుకోవాలని అని హెచ్చరించారని సమాచారం. "లేదు సార్, జనంలో తిరుగుతున్న" అని అంజాద్ బాషా సమాధానం ఇస్తే, "ఎక్కడబ్బా ఎప్పుడు వచ్చిన నీ ఒక్కడివే కనిపిస్తావ్. జనం ఏరీ? " అని జగన్ ప్రశ్నించినట్లు సమాచారం. అంటే తాను బెంగళూరు, తాడేపల్లి నుంచి కడపకు వస్తే, విమానాశ్రయం, పులివెందులలో "పెద్ద సంఖ్యలో జనం లేరు" అనే విషయాన్ని జగన్ పరోక్షంగా ప్రస్తావించినట్లు కనిపిస్తోంది. కాగా,
కడప అసెంబ్లీ స్థానంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కమలాపురం ఎమ్మెల్యే, జగన్ మేనమామ పి. రవీంద్రనాథరెడ్డి, ఈయన మిత్రుడు, కడప మేయర్ సురేష్ బాబు మధ్య సఖ్యత లేదనేది జగన్ గ్రహించిన విషయం. గత ఎన్నకల్లో రవీంద్రనాథరెడ్డి కడప టికెట్ ఆశించి, భంగపడి మళ్లీ కమలాపురం నుంచే పోటీ చేసి, ఓటమి చెందారు. 2019 ఎన్నికల నాడు అండగా నిలిచిన ప్రతిపక్ష పార్టీ నేతలు కాస్త దూరంగా జరిగారనే నేపథ్యంలోనే రవీంద్రనాథరెడ్డి కడప సీటు ఆశించి, భంగపడినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ పరిస్థితుల్లో కడప పంచాయతీని జగన్ సున్నితంగా తేల్చేయడం ద్వారా "వ్యతిరేకంగా ఉన్న మైనారిటీ వర్గాలకు మళ్లీ దగ్గర కావడానికి ప్రయత్నించండి" అని పరోక్షంగా సూచిస్తూ, "జనంలో తిరగండి. సమస్యలు పట్టించుకోండి. ప్రభుత్వంపై పోరాటం సాగించండి" అని జగన్ హితోపదేశం చేసినట్లు తెలుస్తోంది.
ఈ సెగ్మెంట్లలో చేసిన పంచాయితీ ఎంత వరకు ఫలిస్తుంది? ప్రత్యర్థులతో అసంతృప్తిగా ఉన్న నేతలు ఎందురు జారీ పోతారనేది వేచిచూడాలి.
Tags:    

Similar News