స్థానిక సంస్థల నాయకులతో నేడు జగన్‌ భేటీ

వైఎస్‌ఆర్‌సీపీ నాయకులతో ఇటీవల జగన్‌మోహన్‌రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.;

Update: 2025-05-01 04:49 GMT

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో ఇటీవల వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితం అన్ని జిల్లాల వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించిన జగన్, అదే రోజు అన్ని పార్లమెంట్‌ నియోజక వర్గాలకు పరిశీలకులను కూడా నియమించారు. తాజాగా గురువారం స్థానిక సంస్థల నాయకులతో తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ సమావేశం కానున్నారు.

కాకినాడ జిల్లా పుఠాపురం మునిసిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం మునిసిపాలిటీ, శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజక వర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం నియోజక వర్గం రామకుప్పంలకు చెందిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాజీ సీఎం జగన్‌ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఆయా ప్రాంతాల, మునిసిపాలిటీల ఎంపీపీలు, వైఎస్‌ ఎంపీపీలు, మునిసిపల్‌ చైర్మన్లు, చైర్‌పర్సన్‌లు, మునిసిపల్‌ వైస్‌చైర్‌ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఆయా జిల్లాల వైసీపీ ముఖ్య నాయకులు హాజరు కానున్నారు.
Tags:    

Similar News