మహిళను చెట్టుకు కట్టేసి కొడతారా? రక్షణ అంటే ఇదేనా?
సీఎం చంద్రబాబు దుర్గాపు పాలనకు కుప్పం ఘటన నిదర్శనమని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టి, హింసించిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు.. మీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? అంటూ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో, సీఎం చంద్రబాబు పాలనలో మహిళలకు ఆత్మగౌరవం కరువైందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నియోజక వర్గం కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటనపై సోషల్ మీడియా వేదికగా జగన్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అఘాయిత్యాలకు కుప్పం దుర్ఘటనే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజక వర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన మీ దుర్మార్గపు పాలనకు నిదర్శనమని సీఎం చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు.