కోడెల ఫర్నిచర్ దొంగ అయితే జగన్ ఎవరు?

‘తాడేపల్లి, లోటస్‌పాండ్ ఇళ్లకు రూ.50 కోట్లు సీఎంవో ఖాతాలోవి తీసుకువచ్చి ఫర్నిచర్, ఇతర వసతులను అమర్చుకున్నారు’ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.

Update: 2024-06-16 12:23 GMT

‘జగన్ ఓ ఫర్నీచర్ దొంగ.. కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ ఫర్నీచర్‌ను తన తాడెపల్లి ఫ్యాలెస్‌కు తరలించిన అవినీతి సీఎం’.. కొన్ని రోజులుగా టీడీపీ వర్గాలు, సోషల్ మీడియా చేస్తున్న ఆరోపణలు ఇవి. వీటికి సాక్ష్యాలుగా వారు కొన్ని ఫొటోలను కూడా షేర్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ సచివాలయమో, సెక్రటేరియట్‌లో మీటింగ్ హాలో అనుకున్న గది.. జగన్ ఇంట్లోని ప్లేస్ అని తెలిసి ప్రజలు కూడా ఖంగుతిన్నారు. ఇది మేమెక్కడా చూడలేదే అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్న లోగోను కూడా జగన్ తన ఇంటికి తరలించేశారంటే మాటలా..! ఇదిలా ఉంటే తాజాగా ఈ ఫర్నీచర్ దొంగతనం అంశంపై రాష్ట్ర రెవెన్యూ శాఖ నూతన మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఘాటుగా స్పందించారు. ఆనాడు కోడెల శివప్రసాద్ ఫర్నీచర్ దొంగ అయితే ఇప్పుడు జగన్ ఏమవుతారంటూ నిలదీస్తున్నారు. ఇప్పుడు కూడా వైసీపీ పార్టీ నీతి వ్యాఖ్యాలు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లెవేయడం మాదిరిగా ఉంటుందంటూ చురకలంటించారు. నిజంగా నిజాయితీ పరులైతే ఇప్పటివరకు ఫర్నీచర్‌కు ఎందుకు హ్యాండోవర్ చేయలేదని ఆయన ప్రశ్నించారు.

‘కొడెలది హత్యే’

‘‘ఆనాడు టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను చేయని తప్పుకు బలితీసుకున్నారు. లేనిపోని అభాండాలు వేసి ఆయనను ఎంతో బాధించారు. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేకే ఆనాడు కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయనదు ముమ్మాటికి వైసీపీ చేసిన హత్యే. ఆనాడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తన ఇంటి నుంచి ప్రభుత్వ ఫర్నీచర్‌ను తీసుకు వెళ్లాలంటూ కోడెల శివప్రసాద్.. స్పీకర్‌కు రెండుసార్లు లేఖ రాశారు. అయితే ప్రభుత్వం స్పందించలేదు. పైగా ఆయనపై కేసులు పెట్ట కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు’’ అని గతాన్ని గుర్తు చేశారు అనగాని.

‘ఇప్పుడు జగన్ చేసిందేంటి’

అప్పుడు కోడెల చేసింది దొంగతనం అయితే ఇప్పుడు జగన్ చేసిందేంటని, ఇంటిని ప్రభుత్వ కార్యాలం మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం కూడా పెట్టడం నేరం కాదా అని ప్రశ్నించారు. ‘‘ప్రతిపక్ష నేత జగన్ తన ఇంట్లో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్‌ను సరెండర్ చేయకుండా ఇంకా వాడుకుంటున్నారు. పైగా ప్రశ్నించినా సమాధానం చెప్పట్లేదు. ఇప్పటికీ వైసీపీ వాళ్లు నీతులు చెప్పడం సిగ్గు చేటు. అంత నీతే ఉంటే ముందు జగన్‌ను ఫర్నీచర్‌ సరెండర్ చేయమని చెప్పండి. అప్పుడు కోడెలను దొంగ దొంగ అంటూ కాకుల్లా పొడుచుకు తిన్న వైసీపీ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? తాడేపల్లి, లోటస్ పాండ్ ఇళ్లలోని ఫర్నీచర్ సహా ఇతర వసతుల కోసం రూ.50 కోట్లు సీఎంవో ఖాతాలోని నిధులు వ్యచ్చించారు. ఆ ఫర్నిచర్‌ను తిరిగి అప్పగిస్తానని ప్రతిపక్ష నేత జగన్ ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయలేదు’’ అని తెలిపారాయన.

కడిగిన ముత్యంలా కోడెల కుటుంబం..

కోడెల శివ ప్రసాద్ కుటుంబంపై కూడా వైసీపీ లేనిపోని నిందలు మోపిందని అనగాని సత్యప్రసాద్ చెప్పారు. ‘‘వైసీపీ వాళ్లు ఎంత వేధించినా తట్టుకుని నిలబడింది కోడెల శివప్రసాద్ కుటుంబం. ఈరోజున ఆ దేవుడు.. కోడెల శివప్రసాద్ కుటుంబాన్ని కడిగిన ముత్యంలా ప్రజల్లో నిలిపారు. అంతేకాకుండా అకారణంగా వారిపై అస్యత ఆరోపణలు చేసిన, వేధింపులకు గురి చేసిన వారి దొంగ బుద్దిని ప్రజలకు అర్థమయ్యేలా చేశారు. ఆనాడు కోడెలకు జగన్ ఏం చేశారో ఇప్పుడు జగన్‌కు అదే తిరిగొచ్చింది. ఖర్మ సిద్దాంతాన్ని అందరూ తప్పక నమ్మాలి. ఖర్మ ఎవరిని వదలదు అనడానికి జగన్ ఒక ఉదాహరణ. మన తప్పు చేసతే మనకూ తప్పే జరుగుతుందని జగన్ దొంగతనం వ్యవహాకోడెల శివప్రసాద్‌ది వైసీపీ చేసిన హత్యే అని మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆరోపించారు. కోడెలను నిందించిన జగన్ ఇప్పుడు తాను ఏం చేశారని అనగాని నిలదీశారు.రం తేటతెల్లం చేసింది. ఒకప్పుడు జైలు కొట్టిన జనాలే ఇప్పుడు జగన్‌ను చూసి ఛీ కొడుతున్నారు’’ అని అన్నారు.


Tags:    

Similar News