పవనన్న కంటే జగన్‌కే ఎక్కువ సెక్యూరిటీ ఉంది
రెడ్ బుక్ కోసం పోలీసులు ఎందుకు పని చేయకూడదో చెప్పాలని మంత్రి లోకేష్ ప్రశ్నించారు.;
By : Vijayakumar Garika
Update: 2025-04-03 08:33 GMT
మంత్రి నారా లోకేష్, పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మరణంపైన, రెడ్ బుక్ అమలు చేస్తున్న విధానంపైన, జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సెక్యూరిటీపైన సంచలన కామెంట్స్ చేశారు. మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టూలను అందజేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ అనంతరం మీడియాతో మాట్లాడారు. రెడ్ బుక్ కోసం పోలీసులు పని చేస్తున్నారు, ఇది రాజ్యాంగం విరుద్ధం కదా? అని వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.. దీని మీద ఏమంటారని విలేకరి అడిన ప్రశ్నకు మంత్రి లోకేష్ స్పందిస్తూ.. రెడ్ బుక్ పాలన కోసం లేదా రెడ్ బుక్ అమలు కోసం పోలీసులు ఎందుకు పని చేయకూడాదని తిరిగి ప్రశ్నించారు.
రెడ్ బుక్‌లో ఏముందని పోలీసులు పని చేయకుండా ఉండటానికి చెప్పాలని ప్రశ్నించారు. తమ పార్టీ కార్యకర్తలను అన్యాయంగా ఇబ్బందులు పెట్టిన వారిని, చట్టం, నిబంధనలు ఉల్లంఘించిన వారిని వదిలి పెట్టమని అన్నాం. అంటే వారు చట్టాలను, నిబంధనలను ఉల్లింఘిచినట్లే కదా? అని జవాబిచ్చారు. ఇంకా దానిని కొనసాగిస్తూ.. గత ప్రభుత్వ హయాంలో చట్టాలను ఉల్లంఘిచిన వారిపైన యాక్షన్ తీసుకుంటాం.. తీసుకుంటున్నాం.. అదే రెడ్ బుక్ అంటూ పేర్కొన్నారు. దానిలో ఎలాంటి డౌట్ లేదన్నారు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు. గేట్లకు తాళాలు వేయడం.. ఏమి తప్పు చేయనోడిపైన దొంగ కేసులు పెట్టడం.. అలా తామెప్పుడూ చేయలేదన్నారు. ఈ రోజు జగన్‌మోహన్‌రెడ్డి జడ్‌ప్లస్ భద్రతతో ఫ్రీగా తిరుగుతున్నారు. పవనన్న కంటే జగన్‌కు ఎక్కువ సెక్యూరిటీ ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవనన్నకు జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటే.. జగన్‌మోహన్‌రెడ్డికి జడ్‌ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉందన్నారు. ప్రభుత్వమే ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏ నాడు కూడా జగన్‌మోహన్‌రెడ్డి కార్యక్రమాలను అడ్డు కోలేదు. రెడ్ బుక్ అమలు విషయంలో కూటమి ప్రభుత్వం చాలా క్లియర్‌గా ఉందన్నారు.
పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి మీద లోకేష్ మాట్లాడుతూ.. వైసీపీ తమతో ధీటుగా పోటీపడలేక, కుల మత, ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ లక్ష్యమని అన్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదన్నారు. పాస్టర్ ప్రవీణ్‌దే కాదు.. ముందుకు ముందు కూడా వైసీపీ ఇలాంటి డ్రామాలు చేస్తారు. అనేక డ్రామాలు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్‌గా తీసుకుంది. దర్యాప్తు కూడా చాలా సీరియస్‌గా తీసుకుంది. ఒక వేళ ఎవరైనా తప్పు చేస్తే.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. తప్పు చేసిన వారులో ఎవరైనా ఉండనీ.. టీడీపీ వాళ్లు కావచ్చు.. జనసేన వాళ్లు కావచ్చు.. బీజేపీ వాళ్లు కావచ్చు.. వైసీపీ వాళ్లు కావచ్చు. తప్పు చేస్తే మాత్రం ఎవరినీ వదిలి పెట్లే ప్రసక్తే లేదని అన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో సీఎం చంద్రబాబు చాలా క్లారిటీగా ఉన్నారని మంత్రి లోకేష్ చెప్పారు.