ట్రేడింగ్ కంపెనీలలో ఐటీ సోదాలు..తెలుగు రాష్ట్రాలలో కలకలం
ఏపీ, తెలంగాణలోని 25 చోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు.
By : V V S Krishna Kumar
Update: 2025-10-07 12:24 GMT
ఏపీ, తెలంగాణలోని 25 చోట్ల ఆదాయపు శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల జరుగుతున్న ఐటీ సోదాలు చర్చనీయాంశమయ్యాయి.రూ.300కోట్ల దాల్ ట్రేడ్ కేసులో హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
గత వైసీపీ హయాంలో పలు ట్రేడింగ్ కంపెనీలు భారీగా నగదు లావాదేవీలు జరిపినట్లు అధికారులు చెబుతున్నారు.పలు ట్రేడింగ్ కంపెనీలు పౌరసరఫరాల శాఖ నుంచి అనుమతులు పొంది పప్పు దినుసులు సరఫరా చేయకపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ విశాఖపట్నంలో హిందుస్థాన్ ట్రేడర్స్, కర్నూలుల వీకేర్ గ్రూప్‌లో సోదాలు జరిగాయి. 2024 ఎన్నికల సమయంలోనూ పలు ట్రేడింగ్ కంపెనీలు భారీగా నగదు విత్‌డ్రా చేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఆ నేపధ్యంలోనే సోదాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.