Assault on Manoj|మనోజ్ మీద దాడి నిజమే(వీడియో)

తనపైన దాడి జరిగిందన్న విషయాన్ని మనోజ్(Manchu Manoj) బంజారాహిల్స్(Banjara Hills) లోని ఒక ప్రైవేటు ఆసుపత్రి దగ్గర చెప్పకనే అందరికీ తెలిసేట్లు చేశాడు.

Update: 2024-12-08 15:14 GMT

సినీనటుడు, మంచుమోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ మీద దాడి జరిగింది నిజమే. తనపైన దాడి జరిగిందన్న విషయాన్ని మనోజ్(Manchu Manoj) బంజారాహిల్స్(Banjara Hills) లోని ఒక ప్రైవేటు ఆసుపత్రి దగ్గర చెప్పకనే అందరికీ తెలిసేట్లు చేశాడు. తనపైన దాడి జరిగిందని ఎవరికీ చెప్పలేదుకాని కారులోనుండి దిగిన మనోజ్ సహాయకుల సాయంతో కుంటుకుంటు నేరుగా ఆసుపత్రిలోకి వెళ్ళిపోయాడు. మనోజ్ కుంటుకుంటు వెళ్ళటం చూస్తేనే తనపైన దాడి జరిగిందన్న విషయం తెలిసిపోతోంది. మనోజ్ పైన దాడి జరిగిందనే ప్రచారం తప్పని, దయచేసి ఎవరూ తప్పుడు ప్రచారం చేయద్దని ఉదయం మోహన్ బాబు(MohanBabu) చేసిన విజ్ఞప్తి అబద్ధమని తేలిపోయింది. ఇంట్లో జరిగిన గొడవను కవర్ చేసుకుందామని మోహన్ బాబు చేసిన ప్రయత్నమే అని ఇపుడు అందరికీ అర్ధమైపోయింది.

నిజానికి ఇంట్లో గొడవలను రోడ్డుమీద పడటాన్ని ఎవరూ ఇష్టపడరు. కాని ఎప్పుడైతే గొడవలు నాలుగు గోడలు దాటి రోడ్డుమీదకు వచ్చేస్తాయో అప్పుడే ఇంటిగుట్టు రచ్చకెక్కినట్లు అర్ధమైపోతుంది. సాయంత్రం మనోజ్ తన భార్య భూమా మౌనిక(Bhuma Mounika)తో పాటు సహాయకులతో ఆసుపత్రికి వచ్చారు. అక్కడున్న మీడియా ఇంట్లో జరిగిన దాడిగురించి అడిగినపుడు ఏమీ మాట్లాడకుండా కుంటుకుంటు ఆసుపత్రిలోకి వెళ్ళిపోయారు. మీడియా కెమెరాలు తనను చిత్రీకరిస్తున్న విషయం తెలుసు కాబట్టి తలొంచుకునే ఆసుపత్రిలోకి వెళ్ళిపోయాడు. ఎంతైనా సినిమానటుడు కదా కాబట్టి తాను నోటితో చెప్పకుండానే ఏమి జరిగిందనే విషయాన్ని యాక్షన్లో చూపించేశాడు. దీంతో మనోజ్ మీద దాడి జరిగింది నిజమే అన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. ఇక తాను మీడియాముందుకు లేదా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తేనే మిగిలిన విషయాలు బయటపడతాయి.

Tags:    

Similar News