ట్రంప్ పై పైచేయి సాధించిన కమలా హారిస్

ఇద్దరూ ఇద్దరే.. 2016లో ఒకరు ప్రెసిడెంట్ మరొకరు సెనేటరు.. 2020లో ఆయన ఓటమికి సాయపడింది. అయినా ఆ ఇద్దరికి పరిచయం లేదు. ఆ ఇద్దరే మళ్లీ 2024లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.

Update: 2024-09-11 13:09 GMT

ఇద్దరూ ఇద్దరే.. 2016లో ఒకరు ప్రెసిడెంట్ మరొకరు సెనేటరు.. 2020లో ఆయన ఓటమికి సాయపడింది. అయినా ఆ ఇద్దరికి పరిచయం లేదు. ఆ ఇద్దరే మళ్లీ 2024లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరు ఎవరో కాదు ఒకరు డోనాల్డ్ ట్రంప్, మరొకరు కమలా హారిస్. అసలు పరిచయం అక్కర్లేని ఆ ఇద్దరూ మంగళవారం రాత్రి ఓ బిగ్ డిబేట్ లో తలపడ్డారు. ఆ సమయంలో హాల్ మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్ నేను “కమలా హారిస్” అని పరిచయం చేసుకోవడం ముచ్చటేసింది.

అగ్రరాజ్యం అమెరికా కి మరో 52 రోజుల్లో (నవంబర్ 5న) ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ మీడియా ఛానళ్లు బిగ్ డిబేట్ పేరిట అధ్యక్ష పదవికి పోటీ పడే ప్రధాన పార్టీలు- రిపబ్లికన్, డెమోక్రాట్స్- అభ్యర్థుల్ని ఓ వేదిక మీదకు పిలిచి ఇరువుర్ని కొన్ని ప్రశ్నలు అడిగి జవాబులు రాబడతాయి. అమెరికాలో ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు ఈ డిబేట్లు ఉపయోగపడతాయి. రెండు నెలల కిందట ఫాక్స్ న్యూస్ ఛానల్ నిర్వహించిన ట్రంప్ పైచేయి సాధించారు. ఈసారి ఏబీసీ మీడియా ఛానల్ బిగ్ డిబేట్ నిర్వహించింది. దాదాపు 40 రోజులుగా ఈ డిబేట్ కోసం ఇరు పార్టీల అభ్యర్ధులు తయారవుతూ వచ్చారు. ట్రంప్, కమలా హారిస్ హాజరై వారి వారి వాదనలు వినిపించారు. 90 నిమిషాల పాటు జరిగిన ఈ చర్చా వేదికలో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల విధానాల మొదలు తాము ఎన్నికైతే ఈ ప్రపంచానికి ఏమి చేస్తామో కూడా చెప్పారు. ఫిలడెల్ఫియాలోని నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్‌ వేదికగా సాగిన చర్చకు ముందు అమెరికా ఉపాధ్యక్షురాలు తన చేతిని చాచి, “కమలా హారిస్” అని పరిచయం చేసుకుంది.

2016లో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికై వైట్ హౌస్ లోకి అడుగుపెట్టిన డొనాల్డ్ ట్రంప్‌ను ఆనాడు సెనేటర్ గా ఉన్న హారిస్ తొలిసారిగా ఆయన్ను పరిచయం చేసుకోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అప్పటి నుంచి వారు ఒకర్నొకరు విమర్శించుకుంటున్నా వారి మధ్య పరిచయం లేకపోవడం కాకతాళీయమేనన్న నానుడీ ఉంది. ట్రంప్ పరిపాలనను, ఆయన అధికారులను తూర్పారపట్టడంలో హారిస్ కు సెనేట్ లో పేరుగాంచారు. నాలుగేళ్ల తర్వాత ఆమె జో బిడెన్ రన్నింగ్ మేట్‌గా ట్రంప్‌ను ఓడించడంలోనూ సాయపడ్డారు.

చిత్రమేమంటే కమలా హారిస్ ను అవకాశం దొరికినప్పుడల్లా విమర్శించే డోనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి డిబేట్ లో అదుపులో ఉంచగలిగారు. ఆమె నవ్వు అస్సహ్యంగా ఉంటుందని, ఆమె వేసుకునే కోటు అదోలా ఉంటుందని వెక్కిరించే ట్రంప్ ఈ డిబేట్ లో వ్యక్తిగత విమర్శల జోలికి పోకుండా హారిస్ నివారించగలిగారు. అబార్షన్‌పై చట్టం తెచ్చే విషయంలో హారిస్ వేసిన ప్రశ్నలకు ట్రంప్ జవాబు కోసం తముడుకోవాల్సి వచ్చింది. ట్రంప్ నిలకడలేని వ్యక్తిగా అభివర్ణించింది.

"నిజానికి డోనాల్డ్ ట్రంప్‌కు ప్రజల అభివృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రణాళిక లేదు, ఎందుకంటే అతను మీ కోసం వెతుకుతున్న దానికంటే తనను తాను రక్షించుకోవడంలోనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు" అని మాజీ ప్రాసిక్యూటర్ అయిన హారిస్ ట్రంప్ పై దాడికి దిగారు. తన వాదన ప్రారంభంలో ఆమె ఆయనకు చురకలంటించారు.

ట్రంప్ పై 34 నేరారోపణలు, హత్యాయత్నం కేసులున్నాయి. డెమొక్రాటిక్ ప్రత్యర్థిని ఆయన ఎదుర్కొనే స్థాయిలో లేరు. పోటాపోటీగా సాగుతున్న అధ్యక్ష పదవి ఎన్నిక రేసులో నిలిచిన నేను సాపేక్షంగా స్థిరంగా ఉన్నా. కానీ ట్రంప్ అటువంటి వారు కాదు అంటూ విమర్శించారు. నేను ఓడిపోయే ఛాన్స్ చాలా తక్కువ అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

కాలిఫోర్నియా గవర్నర్ గెవిన్ న్యూశామ్ మాటల్లో చెప్పాలంటే...

"ఆమె కెమెరాలో చూస్తూనే ఉంది, మీ గురించి మాట్లాడుతుంది, నా గురించి మాట్లాడుతుంది, అమెరికన్ ప్రజల గురించి మాట్లాడుతుంది. ప్రజలు దేని గురించి శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నారో ఆమె అదే మాట్లాడుతోంది. ట్రంప్ కుక్కల గురించి మాట్లాడుతున్నాడు, హారిస్ సభలకు హాజరయ్యే జనం గురించి మాట్లాడుతున్నారు, చేసిన తప్పులకు సంబంధించి ట్రంప్ తన మనోవేదనల గురించి ఆయన బాల్యం గురించి మాట్లాడుతున్నాడంటేనే ఆయన పట్ల జాలి కలుగుతోంది. నిజానికి ఇది ఓ బాధితుడి మనస్తత్” అని ఆయన చెప్పడం గమనార్హం. ట్రంప్ పాలిట "ఇది భయంకరమైన రాత్రి. కానీ ఇది ముఖ్యంగా, అమెరికన్ ప్రజలకు గొప్ప రాత్రి." అన్నారు గెవిన్.

చర్చ సందర్భంగా, గర్భస్రావ నిషేధాన్ని వ్యతిరేకించేటట్టయితే ట్రంట్ లేదా ఆయన అనుచరులు ఆ బిల్లును వీటో చేయాలి. కానీ ట్రంప్ కట్టుబడి ఉండరు. సెనేట్‌లో అటువంటి చట్టాన్ని ఆమోదించడానికి అవసరమైన 60 ఓట్లను ఏ పార్టీ కూడా గెలవలేనందున ప్రశ్నించే యోగ్యత లేనిదని వాదించారు. గత ఎన్నికల్లో ఓడిపోయానని లేదా జనవరి 6న తన మద్దతుదారులు అమెరికా రాజధాని పై దాడి చేయడానికి ముందు దాకా మాట్లాడి జనాన్ని రెచ్చగొట్టిన ట్రంప్ తన చర్యలకు చింతిస్తున్నానని చెప్పడానికి కూడా నిరాకరించారు.

ట్రంప్ తనకున్న బలాన్ని భూతద్దంలో చూపడానికి ప్రయత్నించారే తప్ప చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేయలేసే ప్రయత్నం చేయలేదు. న్యూస్ బ్రాడ్ కాస్టర్లు, హారిస్ వేసిన దాదాపు ప్రతి ప్రశ్నను ఇమ్మిగ్రేషన్ (వలసలు) సమస్యకు ముడి పెట్టే ప్రయత్నం చేశారు. "ఆమె చాలా చెడ్డవ్యక్తి, ఇది హాస్యాస్పదంగా ఉంది" అని తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశారే తప్ప చర్చను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయలేదు. ఇది డెమోక్రాట్లకు ప్రత్యేకించి తన గట్టి మద్దతుదారులకు పెద్ద ఊరట కాగా ట్రంప్ మద్దతుదారులకు నిజంగానే భయంకరమైన రాత్రిగా మారింది.

రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థిత్వం కోసం ట్రంప్ తో పాటీ పడి ఆ తర్వాత తప్పుకున్న వివేక్ రామస్వామి మాట్లాడుతూ, "మామూలుగా కంటే హారిస్ మెరుగ్గా వాదించారనే అనుకోవాలి. ఆమె వాడిన చాలా పదాలను మేము విన్నాము, నేను అంగీకరిస్తాను . కానీ ఆచరణలో చూపాల్సింది మాటలు కాదు చర్యలే కదా" అన్నారు వివేక్.

ట్రంప్ వేసిన కొన్ని పంచ్‌లు నవ్వు పుట్టించినా వాదనలో అవి అంత పెద్దగా నిలవలేదనే అభిప్రాయమే కలిగించినట్టు అమెరికన్ నేతలు అభిప్రాయపడుతున్నారు. హారిస్ ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ మాట్లాడుతూ "ఇప్పుడు ఆమె నా తత్వశాస్త్రం" అవలంబించారని అన్నప్పుడు నవ్వులు విరిశాయి. అందుకే "నేను ఆమెకు మాగా (మెకింగ్ అమెరికా ఎగైన్) టోపీని పంపబోతున్నాను" అని చమత్కరించారు.

ట్రంప్ వాదనను హారిస్ కూడా బాగానే తిప్పికొట్టగలిగారు. మార్పుకు తాను ప్రతినిధినని చెప్పుకొచ్చారు. ట్రంప్ చెప్పిందే చెబుతున్నారన్నారు. పాడిందే పాటరా పాశిపళ్ల దాసుడా అనే మాదిరిగా ఉందన్నారు. "అదే పాతపాట.. అలసిపోయిన ప్లేబుక్: అబద్ధాలు, మనోవేదనలు.. ఇవేనా ఇప్పుడు కావాల్సింది" అని ఆమె ట్రంప్ పై విరుచుకుపడి వీక్షకులను ఆకట్టుకున్నారు. ముందుకు పోవాల్సిన మనం వెనక్కి పోవాల్నా అని నిలదీశారు. పేజీ ముందుకు తిరగేయాలే తప్ప వెనక్కి మళ్లకూడదన్నారు.

ఈ సమయంలో ట్రంప్ కూడా హారిస్ పై ఎదురుదాడికి దిగారు. ఆమేను జనాదరణ లేని వ్యక్తిగా అభివర్ణించారు. జనాదరణ లేని అధ్యక్షుడి (జో బిడైన్) కార్బన్ కాపీ అన్నారు. ఇదే కమలా హారిస్ ఒకానొక సమయంలో బిడెన్ ఆర్ధిక ప్రణాళికను హారిస్ చీల్చాడని ట్రంప్ ఆరోపించారు. 'రన్, స్పాట్, రన్,' అనే పదాలు తప్ప ఆమె నుంచి నేర్చుకోవాల్సిందేముందన్నారు. ఆమె వామపక్ష తీవ్ర వాద వాతావరణంలో పెరిగారని, వామపక్ష తీవ్రవాద విధానాలకు మద్దతిచ్చే మార్క్సిస్ట్ అని ఆమెపై విమర్శలకు దిగారు.

అయితే ఆమె ట్రంప్ చేసిన ప్రతి విమర్శకు జవాబు చెప్పారు. అబార్షన్‌పై హారిస్‌ను ట్రంప్ సవాలు చేశారు. తాను మార్క్సిస్టును కాదని చెప్పుకొచ్చారు. 

చర్చ తర్వాత ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ, "ఈ పోటీ అసమంజసమైన పోటీ.. ఇది స్పష్టంగా ముగ్గురు కలిసి ఒకరిపై దాడి చేసినట్టుగా ఉంది" అన్నారు. మోడరేటర్‌లు తనను అన్యాయంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చారు. గతంలో జరిగిన బిగ్ డిబేట్లకు దీనికి తేడా ఉందన్నారు. మోడరేటర్లు వాస్తవాల్ని వెలికి తీయడంపై కన్నా తనను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుందన్నారు. మొత్తం మీద ఈ చర్చ తర్వాత అబార్షన్ నిషేధ వ్యవహారంలో తన వైఖరిని మార్చుకున్నట్టు తెలుస్తోంది.

ట్రంప్ ఆరోపణలను మోడరేటర్లలో ఒకరైన ముయిర్ కూడా తోసిపుచ్చారు. ఒహియోలోని హైతీ వలసదారులు పెంపుడు జంతువులను అపహరించి తింటున్నారని ట్రంప్ లేవనెత్తిన తప్పుడు వాదనను ముయిర్ తోసిపుచ్చారు.

ఈ బిగ్ డిబేట్ తర్వాత జాతీయ మీడియా కూడా పెదవి విరిచింది. న్యూయార్క్ టైమ్స్/ సియానా కాలేజీ పోల్ ప్రకారం 61 శాతం మంది ఓటర్లు రాబోయే అధ్యక్షుడు దేశంలో "పెద్ద మార్పు" తీసుకురావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కేవలం 40% మంది ఓటర్లు మాత్రమే వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ "మార్పు"కి ప్రాతినిధ్యం వహించారని పేర్కొంది. 61% మంది మాజీ అధ్యక్షుడి వైపే ఉన్నట్టు న్యూయార్క్ టైమ్స్ రాసుకొచ్చింది.

2016లో హిల్లరీ క్లింటన్, ట్రంప్ కి మధ్య జరిగిన మూడు డిబేట్లలోనూ హిల్లరీ విజేతగా నిలుస్తుందని ఆనాడు మీడియా సర్వేలు చెప్పాయి. కానీ ట్రంప్ గెలిచారు. ఇంకో డిబేట్ జరగాల్సింది ఉంది. అయితే అది జరుగుతుందా లేదా అనేది సందేహాస్పదంగా ఉంది.

చర్చా వేదికకు కొద్ది దూరంలో ఉన్న చెర్రీ స్ట్రీట్ పీర్‌లో మాట్లాడుతూ హారిస్, ఆమె రన్నింగ్ మేట్ టిమ్ వాల్జ్ ఇప్పటికీ "అండర్ డాగ్స్" అన్నారు. ఈవేళ్టి చర్చ అది నిరూపించింది. "ఈ రాత్రి అమెరికన్ ప్రజలకు ఏమి ప్రమాదంలో ఉందో హారిస్ హైలైట్ చేసి చెప్పారు" అన్నారు. "కష్టపడి పనిచేయడం మంచిది. మేము గెలుస్తాం" అన్నారు చెర్రీ.

Tags:    

Similar News