ఏపీ ప్రజల తరపున ప్రధానికి స్వాగతం..చంద్రబాబు ట్వీట్
శ్రీశైలం మల్లన్న సన్నిధిలో స్పెండ్ చేయనున్న ప్రధాన మంత్రి మోదీ.
కర్నూలుకు వచ్చిన ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలుకుతున్నట్లు సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. మోదీకి స్వాగతం పలుకుతున్న ఫొటోలను ఆయన షేర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొద్ది సేపటి క్రితం కర్నూలుకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, అధికారులు, మంత్రులు, ఎంపీలు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఆ పొటోలను కూడా తన ట్వీట్‌లో షేర్ చేశారు సీఎం చంద్రబాబు. ఇక్కడ నుంచి ప్రధాని మోదీ ప్రత్యేక హెలికాప్టర్‌లో సున్నిపెంటకు చేరుకుంటారు. శ్రీశైలం మల్లికార్జునస్వామి, శ్రీభ్రమరాంబ దర్శనం చేసుకుంటారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం వరకు అంటే మధ్యాహ్నం 12:05 వరకు శ్రీశైలం మల్లన్నస్వామి సన్నిధిలోనే ప్రధాన మోదీ గడపనున్నారు. దర్శనాలు, పూజలు అన్నీ పూర్తి అయిన తర్వాత అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నన్నూరుకు చేరుకుంటారు. అనంతరం రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభకు హారవుతారు.