నేడు పోలీసు స్టేషన్‌లోనే ఐపీఎస్ ఆంజనేయులు
ఏపీపీఎస్సీ కేసులో విచారణ కోసం సీనియర్ ఐపీఎస్ అంజనేయులును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.;
By : The Federal
Update: 2025-05-25 14:23 GMT
డీజీపీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ అంజనేయులును ఆదివారం రాత్రి విజయవాడ సూర్యారావుపే పోలీసు స్టేషన్‌లో ఉంచనున్నారు. ఏపీపీఎస్సీ కేసులో ఏ1 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఎస్‌ఆర్ అంజనేయులును రెండు రోజుల పాటు విచారణ నిమిత్తం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. బీపీ స్థాయిలు పడిపోడం వంటి అనారోగ్య సమస్యలతో çశనివారం ఇబ్బందులు పడిన ఆంజనేయులును విజయవాడ జీజీహెచ్‌కు తరలించి చికిత్సలు చేయించారు. తొలి రోజు విచారణకు ఆదివారం కస్టడీలోకి తీసుకున్న ఆంజనేయులును వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం విచారణ కోసం సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు.
తొలి రోజు విచారణలో ఆదివారం పోలీసులు ఆంజనేయులు మీద ప్రశ్నల వర్షం కురిపించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేపట్టిన పోలీసులు దాదాపు 30కిపైగా ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల వాల్యుయేషన్‌కు సంబంధించిన ప్రశ్నలతో పాటు సైన్ మీడియా సంస్థకు ఇచ్చిన కాంట్రాక్ట్‌పైన, దానికి చెల్లించిన నిధులపైన ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. సైన్ సంస్థ డైరెక్టర్ మధుసూదన్‌తో ఎలా పరిచయమని, ఆయనకు ఎవరు కాంట్రాక్ట్ ఇవ్వమన్నారనే ప్రశ్నలు కూడా సంధించినట్లు సమాచారం.
తొలి రోజు విచారణ అనంతరం రెండో విచారణకు పీఎస్ ఆంజనేయులును విజయవాడ సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌లోనే ఉంచారు. సోమవారం రెండో రోజు విచారణ కొనసాగనుంది. అనంతరం ఆంజనేయులును విజయవాడ జైలుకు తరలించనున్నారు. పీఎస్‌ఆర్ ఆంజనేయులుతో పాటు ఇదే కేసులో ఏ2గా ఉన్న సైన్ మీడియా సంస్థ డైరెక్టర్ మధుసూదన్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.