మరికొద్దిసేపట్లో ఇంటర్ పరీక్షా ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలను మరికొద్ది సేపట్లో విడుదల కానున్నాయి.;
By : The Federal
Update: 2025-04-12 03:32 GMT
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలను మరికొద్ది సేపట్లో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 12 ఉదయం 11గం. సమయంలో రిజల్ట్స్‌ను వెల్లడించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష రాసిన విద్యార్థులకు కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో ఫలితాలను చెక్ చేసుకోవచ్చునని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్లకు కలిపి 10,17,102 మంది పరీక్షలకు హాజరయ్యారు.
ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌తోపాటు మన మిత్ర వాట్సప్ యాప్‌లోనూ పొందవచ్చు. వాట్సప్ నంబరు 95523 00009కు ‘హాయ్’ అని ఎస్‌ఎంఎస్ ఇచ్చి, ఫలితాలను ఎంచుకొని, అవసరమైన సమాచారాన్ని అందిస్తే పీడీఎఫ్ రూపంలో ఫలితాలు వస్తాయి. వీటిని షార్ట్ మెమోగానూ వాడుకోవచ్చు. ఇంటర్ ఫలితాలను హడావిడి లేకుండా విడుదల చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది.
ఇంటర్‌లో ఈ ఏడాది 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి - 19 వరకు ఫస్టియర్ పరీక్షలు జరగగా, మార్చి 3- 20 వరకు సెకండియర్ పరీక్షలను నిర్వహించారు.
AP Inter Results 2025.. ఎలా చెక్ చేసుకోవాలి.. ?
- ముందుగా "AP Inter 1st Year / 2nd Year Results 2025" అనే లింక్‌పై క్లిక్ చేయండి.
-మీ హాల్‌టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.
- వివరాలు ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్‌ను క్లిక్ చేయండి.
- తర్వాతి స్క్రీన్‌లో ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి.
- కావాలనుకుంటే డౌన్‌లోడ్/ప్రింట్ అవుట్ తీసుకోండి.