నైరుతి బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం
గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదులుతూ తీవ్రవాయుగుండంగా రూపాంతరం
Byline : G.P Venkateswarlu
Update: 2024-11-26 10:33 GMT
ప్రస్తుతానికి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 310 కిమీ దూరంలో, నాగపట్నానికి దక్షిణ–ఆగ్నేయంగా 590 కిలో మీటర్ల దూరంలో పుదుచ్చేరికి దక్షిణ–ఆగ్నేయంగా 710 కిలో మీటర్లు, చెన్నైకి దక్షిణ–ఆగ్నేయంగా 800 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర–వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27న తుపానుగా మారే అవకాశం ఉంది.
తదుపరి 2 రోజుల్లో శ్రీలంక తీరం దాటి ఉత్తర–వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు వెళ్ళేందుకు అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో నవంబర్ 26 నుంచి 29 వరకు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, చాలాచోట్ల తేలికపాటి నుంచి∙మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నవంబర్ 27 నుంచి 29 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ కోణంకి కూర్మనాథ్ కోరారు.