నా చెల్లెలు, అమ్మ ఫొటోలు పెట్టి డైవర్ట్ చేస్తున్నారు:మాజీ సీఎం జగన్‌

విజయనగరం, విశాఖలకు తరలించి ఉంటే డయేరియా మరణాలు ఉండేవి కాదు. తాను స్పందించేంత వరకు ప్రభుత్వం పట్టించుకోలేదని జగన్‌ అన్నారు.

By :  Admin
Update: 2024-10-24 11:31 GMT

ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంటే తన చెల్లెలు, అమ్మ ఫొటోలు పెట్టి డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని కూటమి ప్రభుత్వంమై మాజీ సీఎం జగన్‌ ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా బాధితుల పరామర్శించిన అనంతరం జగన్‌ మాట్లాడుతూ.. గుర్లలో సెప్టెంబర్‌ 20న∙తొలి డయేరియా మృతి కేసు నమోదైతే 35 రోజులైనా ప్రభుత్వం స్పందించలేదని, అక్టోబర్‌ 19న తాను ట్వీట్‌ చేసే వరకు ప్రభుత్వం స్పందించలేదని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. డయేరియా బాధితులను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రులకు ఎందుకు తరలించలేదని ప్రశ్నించారు. ఆసుపత్రులకు తరలించకుండా స్కూల్‌ బెంచ్‌లపై వైద్యం చేస్తారా? అని నిలదీశారు. తమ హయాంలో ప్రతి గ్రామంలో సచివాలయాలు కనిపించేవి. అక్కడే వివిధ శాఖల వారు పని చేస్తూ కనిపించే ఉద్యోగులు ఉండేవారు. బడి పిల్లలు చక్కగా నవ్వుతూ కనిపించేవారు. అవన్నీ పోయాయన్నారు. తమ హయాంలో విలేజ్‌ క్లినిక్స్‌ పని చేసేవి, నాడు–నేడుతో బాగుపడిన స్కూళ్లు, రైతు భరోసా కేంద్రాలు కనిపించేవి. చక్కగా ఈ–క్రాపింగ్‌ జరిగేది. ఇప్పుడవన్నీ నీరుగారి పోయాయి. దీనికి గుర్ల గ్రామం ఒక ఉదాహరణ.

ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 14 మంది చనిపోయారు. నీరు బాగాలేక, డయేరియా వచ్చి చనిపోయారని అన్నారు. గుర్లతో పాటు కోట గుండ్రేడు, గోషాడ, నగలవలస గ్రామాల్లో డయేరియా ప్రబలిందన్నారు. 14 మంది మరణిస్తే ఒకరే చనిపోయారని కలెక్టర్‌ అంటున్నారని మండిపడ్డారు. అధికారులు,మంత్రులు దీన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఇష్యూ పెద్దది కావడంతో, సీఎం చంద్రబాబు 8 మంది చనిపోయారని చెబితే, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ 10 మంది చనిపోయారని చెప్పారు. ఇక్కడ తాగు నీరు అందించడంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్నారు. శానిటేషన్‌ కూడా చేయలేదన్నారు. 345 మంది డయేరియా బాధితులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరగా, ప్రై వేటు ఆస్పత్రుల్లో 450 మంది చికిత్స పొందుతున్నారని అన్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితి ఉంటే, ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. ఏదైనా ఇష్యూ జరిగితే, ఆ ఇష్యూను ఎలా డైవర్ట్‌ చేయాలి? ఎలా కవరప్‌ చేయాలి? అది అసలు జరగనట్లు ఎలా చూపించాలి? అన్న దిక్కుమాలిన ఆలోచన ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. 17 కిమీ దూరంలో ఉన్న విజయనగరానికి, 80 కిమీ దూరంలో ఉన్న విశాఖపట్నంకు రోగులను తరలించక పోవడంతోనే ఈ మరణాలు సంభవించాయన్నారు. చివరికి మరణించిన వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కూడా అందలేదన్నారు. డయేరియాతో చనిపోయారని కాకుండా
గుండెపోటుతో చనిపోయారని చెప్పమని వైద్యులు Üలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అలా చెప్పమని చెబుతోంది అంటే, ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో ఆలోచన చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు మార్చి నుంచి కట్టడం లేదని, దాంతో దాదాపు రూ.1800 కోట్లు బకాయిలు పేరుకుపోయన్నారు. విపక్షంలో ఉన్న తాము బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, రూ. 2లక్షల చొప్పున 14 కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఇప్పటికైనా డైవర్షన్‌ పాలిటిక్స్‌ ఆపి, వాస్తవాలను ప్రజలతో పంచుకుని, వారికి క్షమాపణలు చెప్పి, వారికి సహాయం చేసేందుకు అడుగులు ముందుకు వేయాలని ప్రభుత్వానికి హితవు పలికారు. తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే తన చెల్లెలు, అమ్మ ఫోటో పెట్టి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని మండిపడ్డారు. మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు ఏం లేవా? అని ప్రశ్నించారు. ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే. స్వార్థం కోసం వీటని వీటిని పెద్దవి చేసి చూపడం, నిజాలను వక్రీకరించి చూపడం మంచిది కాదన్నారు.
Tags:    

Similar News