లీగల్‌గా క్లారిటీ వచ్చిన తర్వాత విచాణకు వస్తా
విజయసాయిరెడ్డి చెప్పే మాటలను నమ్మొద్దంటూ కౌంటర్ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి, రాజ్ కసిరెడ్డి.;
By : The Federal
Update: 2025-04-19 12:40 GMT
మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి శనివారం స్పందించారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతున్న మాటలు నమ్మొద్దు, త్వరలోనే విజయసాయిరెడ్డి బండారం బయటపెడుతా అంటూ వెల్లడించారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న రాజ్ కసిరెడ్డి శనివారం ఓ ఆడియోను విడుదల చేశారు. తన మీద అన్నీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. తన మీద వచ్చిన ఆరోపణల మీద ముందస్తు బెయిల్ కోసం కోర్టుల్లో పిటీషన్లు నడుస్తున్నాయని, న్యాయపరమైన ప్రక్రియ అంతా పూర్తి అయిన తర్వాత సిట్ అధికారుల విచారణకు సహకరిస్తానని వెల్లడించారు.
మార్చిలో సిట్ అధికారులు హైదరాబాద్‌లోని తన ఇంటి కొచ్చారు. ఆ సమయంలో నేను ఇంట్లో లేను. మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. దీనిపైన నా న్యాయవాదులను సంప్రదించాను. విచారణ పేరుతో పిలిచి పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పారు. దీనిపైన కోర్టును ఆశ్రయిద్దాం. ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దరఖాస్తు చేసుకుందాం. ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత విచారణకు హాజరు కావచ్చు. అని నా న్యాయవాదులు ఇచ్చిన సలహా మేరకు నేను సుప్రీం కోర్టును ఆశ్రయించాను. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటీషన్ వేశాను. ఈ న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది. నాకు న్యాయపరమైన రక్షణ సమకూరిన తర్వాత సిట్ అధికారుల విచారణకు సహకరిస్తా అంటూ ఆ వీడియోలో రాజ్ కసిరెడ్డి పేర్కొన్నారు.
విజయసాయిరెడ్డి తన గురించి మాట్లాడిన మాటల మీద కౌంటర్ ఇస్తాను. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఒక బట్టేబాజ్ మనిషి. ఆయన గురించి ప్రస్తుతానికి ఎక్కువుగా మాట్లాడటం ఇష్టం లేదు. నా లీగల్ మ్యాటర్స్ అన్నీ పూర్తి అయిన తర్వాత సిట్ అధికారుల విచణను ఫేస్ చేస్తాను. తర్వాత మీడియా ముందు విజసాయిరెడ్డి గురించి, ఆయన చరిత్ర గురించి చెబుతాను. తన మీద అసత్యాలు ప్రచారం చేయొద్దు. ఒకసైడ్ స్టోరీస్ విని నిర్థారణకు రావద్దు. నేను చెప్పేది కూడా విని అప్పుడు ఒక కంక్లూషన్‌కు రావాలి అంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు రాజ్య సభ సభ్యులు, వైసీపీ కీలక నేత, జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీలో కోటరీ ఒక టి ఉందో లేదో విజయసాయిరెడ్డికే తెలియాలి అంటూ కౌంట్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి వెళ్లి పోయిన తర్వాత వైసీపీ మీద ఏదోరకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు విజయసాయిరెడ్డే చక్రం తిప్పారు. అటువంటప్పుడు పార్టీలో కోటరీ ఉందో? లేదో? ఆ కోటరీని నడిపిందెవరో? విజయసాయిరెడ్డికి తెలియదా? అంటూ నిలదీశారు. వైసీపీలో 2 స్థానం అనేది ఎన్నడూ లేదని, భవిష్యత్‌లో కూడా ఉండదని, నెంబర్ 1 స్థానం నుంచి 100 వరకు అన్నీ జగన్‌మోహన్‌రెడ్డే అని సుబ్బారెడ్డి చెప్పారు. కావాలనే విజయసాయిరెడ్డి అలా చెబుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఇతర నాయకులు, అధికారులతో చర్చించిన తర్వాతే జగన్ నిర్ణయాలు తీసుకునే వారని తెలిపారు. వైసీపీ హయాంలో ఏ స్కాం జరగలేదని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వీటి అన్నింటిపైన న్యాయపోరాటం చేస్తామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.