Foeticide | మరో ఆడపిల్ల వద్దని.. భార్యను హత్యచేసిన భర్త
కూతురే పుడుతుందని భార్యను అంతం చేశాడు. మూడేళ్ల కూతురినీ కడతేర్చిన ఘటన ఇది.;
By : SSV Bhaskar Rao
Update: 2024-12-06 07:13 GMT
భ్రూణ హత్య మహా పాపం. ఇది నేరం కూడా. ఆ దంపతులకు మూడేళ్ల కూతురు ఉంది. భార్య నిండు చూలాలు. మళ్లీ కూతురు పుట్టబోతోంది. అని భావించిన ఓ వ్యక్తి భార్యను కొట్టి చంపేశాడు. దీంతో ఈ లోకంలోకి రాకముందే ఓ పాప తల్లి కడుపులోనే కన్నుమూసింది. ఏం జరుగుతుందో తెలియక గుక్కపట్టి ఏడుస్తున్న మూడేళ్ల పాపను కూడా కర్కశంగా ఆ తండ్రి గొంతు నులిమి చంపి వేశాడు.
కర్నూలు జిల్లాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఇంకొన్ని రోజుల్లో బిడ్డను ప్రసవించనున్న భార్యను, మూడేళ్ల కూతురుని హతమార్చిన ఆ కసాయి తండ్రి పోలీసులకు లొంగిపోయాడు. ఈ సమాచారం శుక్రవారం పొద్దున్నే వెలుగు చూసింది. దీంతో ఈ విషాద సంఘటన వివరాలు వెలుగుచూశాయి. ఆ కాలనీ మొత్తం కన్నీటితో నిండిపోయింది. మానవత్వం మరిచి, భార్య, వీటను హతమార్చిన కిరాతక వ్యక్తిని శాపనార్థాలు పెట్టారు.
కర్నూలు జిల్లా హెళమంద మండలం హెబ్బటం గ్రామానికి చెందిన సకరప్ప, సలీమా దంపతులకు సమీరా (3) కూతురు. కాగా, సలీమా మళ్లీ గర్భం దాల్చింది. ప్రసవా సమయం దగ్గర పడింది. దీంతో మళ్లీ తమకు కూతురే పుట్టబోతోందని సకరప్ప భావించాడు. దీనిపై భార్య సలీమాతో రోజు గర్షణ జరిగేదని తెలిసింది.
ఇదే విషయమై భార్య సలీమాతో సకరప్ప తీవ్ర స్థాయిలో ఘర్షణ పడ్డాడని స్థానికులు చెప్పిన సమాచారం. తీవ్రంగా గొడవపడిన సకరప్ప భార్య తలపై కర్రతో దాడి చేశాడు. దీంతో ఆమె ప్రాణాలు వదిలింది. గర్భిణిగా సలీమా ఊపిరివదలడంతో గర్భంలో ఉన్న శిశువు కూడా ఈలోకంలోకి రాకుండానే కనుమూసింది.
మూడేళ్ల కూతురినీ..
భార్య సలీమాతో సకరప్ప ఘర్షణ పడే సమయంలో మూడేళ్ల పాప కూడా ఇంట్లో ఉంది. తల్లిదండ్రులు ఎందుకు గొడవపడుతన్నారనే విషయం తెలియని ఆ పసిమొగ్గ గుక్కపెట్టి ఏడుస్తోంది. అయినా కనికరించని సకరప్ప కన్నకూతురు అనే విచక్షణ లేకుండా మూడేళ్ల పాపను గొంతునులిమి చంపేశాడు. అప్పటికీ ఆవేశం చల్లారని కసాయి తండ్రి సకరప్ప నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. దీంతో ఈ ఘటన వెలుగు చూడడమే కాదు. ఏమి జరిగిందేనేది కాలనీ ప్రజలకు తెలిసింది. ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో వాతావవరణం విషాదంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.